చిరంజీవి గారు నాకు దేవుడితో సమానం, వీరాభిమాని సినిమాలో నటించే అవకాశం రావడం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నా - ప్రీమియర్ షో ఈవెంట్ లో హీరో సురేష్ కొండేటి, ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ.
ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా వీరాభిమాని. ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ఈ చిత్ర ట్యాగ్‍లైన్. భూలోకం, యమలోకం నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాంబాబు దోమకొండ. ఎస్‍కే రహ్మాన్, కంద సాంబశివరావు గారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము సంగీతాన్ని (పాటలు) అందిస్తున్నారు. ఈ అభిమాని సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వీరాభిమాని సినిమా ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏపీ తెలంగాణలో మెగాభిమానుల కోసం 70 థియేటర్స్ లో ఉచితంగా వీరాభిమాని సినిమా చూపించబోతున్నారు. మంగళవారం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షో నుంచి సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ - మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమాని కాని వారు ఎవరుంటారు. ఆయన హీరోయిజానికి, మంచితనానికి, సేవకు మనమంతా అభిమానులం. సురేష్ కొండేటి గారు చేసిన వీరాభిమాని సినిమా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ కు వస్తోంది. ఇది చిరంజీవి గారికి ఒక మంచి బర్త్ డే గిఫ్ట్ గా మిగలాలని కోరుకుంటున్నా. ఒక అభిమాని తన హీరో కోసం ఎంతవరకు వెళ్లగలడు అనేది ఈ చిత్రంలో ఆకట్టుకునేలా తెరకెక్కించారు దర్శకుడు రాంబాబు. అన్నారు.
జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ - చిరంజీవ సుఖీభవ అంటూ గతంలో ఒక ఆర్టికల్ రాశాను. అది చూసి చిరంజీవి గారు పిలిచి అభినందించారు. దానికి రిలేట్ అయ్యేలా ఈ మూవీ పాయింట్ ఉంది. ఒక అభిమాని తన హీరో కోసం జీవితాన్ని వదులుకుని యమలోకం వెళ్లి తన అభిమాన పేజీని చించేస్తాడు. తన అభిమాన హీరో చిరంజీవి గారు చేసిన సేవా కార్యక్రమాలను చూసి యముడే ఆశ్చర్యపోయేలా చేస్తాడు. చిరంజీవి గారు స్టార్ గా ఎంత ఎదిగినా ఒక గొప్ప వ్యక్తిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మెగాస్టార్ కు వీరాభిమానిగా సురేష్ కొండేటి ఈ చిత్రంతో ఒక మంచి ప్రయత్నం చేశాడు. సినిమా టీమ్ అంతా బాగా వర్క్ చేసింది. వాళ్లంతా మెగాస్టార్ కు అభిమానులు కావడం విశేషం. వీరాభిమాని సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.
జర్నలిస్ట్ సినీజోష్ రాంబాబు మాట్లాడుతూ - వీరాభిమాని సినిమా చూశాం. మా అందరికీ నచ్చింది. మెగాస్టార్ వీరాభిమానిగా సురేష్ కొండేటి గారు ఈ సినిమాలో బాగా నటించారు. అభిమానుల కోసం 70 థియేటర్స్ లో ఫ్రీ షోస్ వేస్తున్నారు. ఇటీవలే సంతోషం అవార్డ్స్ ఘనంగా చేసిన సురేష్ గారు...ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా అన్నారు.
రాఘవశర్మ మాట్లాడుతూ - వీరాభిమాని మెగాభిమానులు అందరికీ నచ్చుతుంది. మెగాభిమానికి మారుపేరు సురేష్ కొండేటి. నేనూ మెగాభిమానినే. వారింట్లో కొద్ది రోజులు గడిపే అవకాశం నాకు దక్కింది. ఈ సినిమాలో సురేష్ కొండేటి నటన చాలా బాగుంది. నరకం సీన్స్ ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులంతా ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.
నిర్మాత ఎస్ కే రెహ్మాన్ మాట్లాడుతూ - వీరాభిమాని సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్. మా దేవుడు చిరంజీవి గారిపై ఈ సినిమా చేశాం. ఆయన కోసం ఇంకా సినిమాలు చేస్తాం. ఆయన పేరు మీద ప్రతి ఊరిలో సేవా కార్యక్రమాలు చేస్తాం. సురేష్ కొండేటి గారు మా మూవీలో తన నటనతో ఆకట్టుకుంటారు. ప్రేక్షకులంతా మా సినిమాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
రైటర్ చరణ్ మాట్లాడుతూ - వీరాభిమాని సినిమా కథను మా డైరెక్టర్ రాంబాబు గారు నాకు చెప్పినప్పుడు ఎంతో ఇన్స్ పైర్ అయ్యాను. ఒక అభిమాని తన హీరోను చిరకాలం భూమ్మీద ఉండేలా చేసేందుకు చేసిన ప్రయత్నమే ఈ సినిమా నేపథ్యం. ఈ కథ వినగానే మంచి డైలాగ్స్ రాయాలని అనిపించింది. మీరు సినిమాలే చూసే ఉంటారు ప్రతి క్యారెక్టర్ కు ఆకట్టుకునేలా డైలాగ్స్ రాయడానికి ప్రయత్నించాను. మానవత్వం మూర్తీభవించిన మా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నా అన్నారు.
నిర్మాత దారిపల్లి నవీన్ మాట్లాడుతూ - ఒక మెగాభిమానిగా ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది. ఎందరో మహనీయులు మన మధ్య నుంచి వెళ్లిపోయారు. తన హీరో అలా వెళ్లిపోకూడదని ఒక అభిమాని చేసిన ప్రయత్నమే ఈ సినిమా. సురేష్ కొండేటి గారు ఎన్నో హిట్ చిత్రాలను మన ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాతో నటుడిగానూ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా అన్నారు.
లిరిక్ రైటర్ విట్టుబాబు మాట్లాడుతూ - వీరాభిమాని సినిమాలో శ్రీ ఆంజనేయం అనే పాట రాశాను. ఈ చిత్రానికి మా రాంబాబు గారి డైరెక్షన్, చరణ్ గారి డైలాగ్స్ హైలైట్ గా ఉన్నాయి. సురేష్ గారు వీరాభిమాని పాత్రలో ఆకట్టుకునేలా నటించారు. ఈ సినిమా నెక్ట్స్ పార్ట్ లో చిరంజీవి గారిని గెస్ట్ రోల్ లో చూడాలని ఉంది అన్నారు.
వ్యాపారవేత్త ప్రవీణ్ మాట్లాడుతూ - సురేష్ కొండేటి ఇటీవలే సంతోషం అవార్డ్స్ వేడుక సక్సెస్ ఫుల్ గా నిర్వహించాడు. ఇప్పుడు ఈ మూవీతో హీరోగా మన ముందుకు వస్తున్నాడు. ఆయన నిర్మాతగా సక్సెస్ అయినట్లే హీరోగానూ సక్సెస్ అవుతాడు. సురేష్ కొండేటి మెగాభిమానుల్లో ముందుటాడు. ఈ సినిమా నటుడిగానూ ఆయనకు మరిన్ని అవకాశాలు తీసుకువస్తుందని ఆశిస్తున్నా అన్నారు.
డీవోపీ శేషు డి. నాయుడు మాట్లాడుతూ - నేను మెగాభిమానిని. ఇండస్ట్రీలోకి వచ్చాక జానీ, ఠాగూర్ మూవీస్ కు డీవోపీ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశాను. ఇప్పుడీ వీరాభిమాని సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను ఇంత పెద్ద స్కేల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మెగాభిమానిగా సంతోషిస్తున్నా అన్నారు.
డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ - వీరాభిమాని సినిమాను ఇంత బాగా రిలీజ్ కు తీసుకొస్తున్నామంటే అందుకు సురేష్ కొండేటి గారు, మా ప్రొడ్యూసర్స్ సపోర్ట్ కారణం. అజయ్ ఘోష్, అన్నపూర్ణమ్మ, మణిశర్మ గారు ఇలా ఎంతోమంది మెగాస్టార్ మీద అభిమానంతో ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ నెల 22న 70 థియేటర్స్ లో ఉచితంగా మెగాభిమానులకు సినిమాను ప్రదర్శిస్తున్నాం. మీరంతా తండోపతండాలుగా వెళ్లి వీరాభిమాని సినిమా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.
హీరో సురేష్ కొండేటి మాట్లాడుతూ - డైరెక్టర్ రాంబాబు గారు వీరాభిమాని సినిమా కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. ఒక రోజు ఫోన్ చేసి కథ సినాప్సిస్ పంపండి అన్నాను. చదివాక బాగుందని అనిపించింది. ఇందులో మీరే హీరో అని రాంబాబు గారు చెప్పినప్పుడు వద్దు నేను చేయను అన్నాను. ఈ కథకు మీరే బాగుంటారని వాళ్లు చాలా రోజులు వెంటపడ్డారు. నేను అవాయిడ్ చేస్తూ వచ్చాను. వీళ్ల పట్టుదల చూసి నటించాల్సివచ్చింది. చిరంజీవి గారు నాకు దేవుడితో సమానం. ఈ చిత్రంలో నటించడం దేవుడి వరంగా భావిస్తున్నాను. వీరాభిమాని సినిమాకు నాలుగైదు షోస్ వేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మెగాస్టార్ మీద నా అభిమానాన్ని ఈ చిత్రంతో తెలియజేస్తున్నట్లు భావిస్తున్నా. చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఏపీ తెలంగాణ 70 థియేటర్స్ లో ఉచితంగా సినిమాను ప్రదర్శిస్తున్నాం. మెగాభిమానులంతా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. ఈ చిత్రంలో నటించిన అజయ్ ఘోష్ గారికి, అన్నపూర్ణమ్మ గారికి థ్యాంక్స్. అలాగే ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న స్వామి నాయుడు గారికి థ్యాంక్స్ అన్నారు.
నటీనటులు - సురేష్ కొండేటి, అజయ్ ఘోష్, అక్సాఖాన్, జై క్రిష్, అన్నపూర్ణమ్మ, ఎస్ కే రెహ్మాన్, తదితరులు.
ఈ చిత్రానికి సహనిర్మాతలు : దరిపల్లి బ్రదర్స్, కేఎల్ లక్ష్మణ్, ఏవీ చారి, సిహెచ్ దివాకర్, టెక్నికల్ టీమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - మెలొడీ బ్రహ్మ మణిశర్మ
మ్యూజిక్ (సాంగ్స్) - రాము, డిఓపి : శేషు డి నాయుడు, ఎడిటర్ : శివ శర్వాణి, నిర్మాతలు - ఎస్ కే రెహ్మాన్, కంద సాంబశివరావు, దర్శకత్వం - రాంబాబు.