కింగ్ నాగార్జున అంటే ఎంతో పరిశుభ్రత. స్టైల్ అనే పదానికే నిర్వచనం అతడు. టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్. అలాంటి హీరోని పట్టుకుని పరిసరాల్ని అపరిశుభ్రంగా ఉంచుతాడు! అని అంటారా? అంటే అన్నారులే కానీ, అతడిని అలా అన్నది ఎవరో తెలుసా? స్వయానా సోదరుడు అక్కినేని వెంకట్, సోదరి నాగ సుశీల. అన్నయ్య, అక్క ఇద్దరూ జగపతిబాబు హోస్టింగ్ చేస్తున్న `జయమ్ము నిశ్చయమ్మురా` షోలో నాగార్జున గుట్టంతా బయటపెట్టారు.
బ్యాచిలర్ గా ఉన్న నాగార్జున అమెరికాలో బ్యాచిలర్ రూమ్ లో ఉండేవాడు. ఆ రూమ్ కి వెళితే ఎప్పుడూ కడగని ప్లేట్లు, టాయ్ లెట్లు దర్శనమిచ్చేవి. రూమ్ ని బ్యాలెన్స్ చేసేవాడు కాదు. అతడితో పాటు ఫ్రెండ్స్ కూడా అలాంటివాళ్లే. అందువల్ల ఎప్పుడూ నాలుగైదు రోజులు తిన్న ప్లేట్లు అలానే పడి ఉండేవి. వాటిని చూసి నాగసుశీల నీట్ గా కడిగి వెళ్లేవారు. కట్ లెరీ లేదా స్పూన్ లు కూడా బాత్రూమ్ లో సింక్ లో పడి ఉంటే వాటిని కూడా కడిగేసి నాగసుశీల వెళ్లేవారు. బాత్రూమ్ అంతా పచ్చగా కనిపించేది. రకరకాల లోషన్లు, పేస్టులు ఉపయోగించడం వల్ల అలా అయ్యేదని సుశీల చెప్పారు.
తన సోదరుడు, అతడి రూమ్ మేట్స్ కూడా లేజీగా ఉండేవారని వెంకట్ తెలిపారు. మొత్తానికి నాగార్జున అసలు గుట్టు మొత్తం బయటపడిపోయింది. కింగ్ అమెరికాలోనే ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్ కి వచ్చి స్టార్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి బ్యాచిలర్ లైఫ్ లో ఎవరైనా అలానే ఉంటారు. కొందరు మాత్రమే క్లీన్ లీ నెస్ అంటూ జాగ్రత్తపరులు ఉంటారు!