సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు అన్ని భాషల్లోను టాప్ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లోనే కాదు హిందీలోనూ రష్మిక గట్టిగానే జెండా పాతేసింది. హిందీలో టాప్ హీరోయిన్స్ ను పక్కనపెట్టి మరీ రష్మిక కు స్టార్ హీరోలు ఛాన్స్ లు ఇస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి థామా హర్రర్ చిత్రంతో విభిన్నమైన కేరెక్టర్ చేస్తుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఫొటోస్ షేర్ చేసే రష్మిక మందన్న తాజాగా క్యూట్ సెల్ఫీ లుక్స్ ని తన ఇన్స్టా పేజీ లో షేర్ చేసింది. రకరకాలుగా క్లోజప్ సెల్ఫీలతో రష్మిక తీసుకున్న ఆ క్యూట్ సెల్ఫీస్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండడమే కాదు రష్మిక మందన్న టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేస్తుంది, త్వరలోనే వీరిద్దరూ వివాహం కూడా చేసుకుంటారనే ప్రచారం నడుస్తుంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ-రష్మిక న్యూయార్క్ లో సందడి చేసారు.