విశ్వావిఖ్యత ఎన్టీఆర్ పెద్ద కోడలు, నందమూరి జయకృష్ణ గారి శ్రీమతి పద్మజ ఈ రోజు మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యం తో బాధపడుతూ.. హాస్పిటల్ లో చికిత్స మృతి చెందారు. పద్మజ వయసు 73 సంవత్సరాలు.. గత కొంతకాలం గా ఆమె అనారోగ్యం తో బాధపడుతున్నారు.
ఈరోజు తెల్లవారుఝామున పద్మజ శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది ఎదురు కావడంతో హాస్పిటల్ లో చేర్పించారు.. కానీ ఫలితం లేకపోవడంతో ఆమె తుది శ్వాస విడిచారు. పద్మజ మరణ వార్త తో విజయవాడ నుండి ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ నుండి పురందేశ్వరి, మంత్రి నారా లోకేష్ ఈరోజు మధ్యాహన్నానికి హైదరాబాద్ కి చేరుకోనున్నారు. పురందరేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరావు కు పద్మజ స్వయానా సోదరి.
నందమూరి కుటుంబంలో జయకృష్ణ భార్య పద్మజ మృతి తో విషాద ఛాయలు అలుముకున్నాయి.