Advertisement
Google Ads BL

వార్ 2 లోని సీక్రెట్స్ రివీల్ చేయకండి


ఇండియన్ ఐకానిక్ స్టార్‌లైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌‌లతో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ వార్ 2 మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు వార్ 2 మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అభిమానులకు స్పాయిలర్‌ల గురించి హీరోలు రిక్వెస్ట్‌ చేశారు.

Advertisement
CJ Advs

వార్ 2 సినిమాను ఎంతో ప్రేమతో, ఎంతో కష్టపడి తెరకెక్కించాం. ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్స్ పీరియెన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే సినిమాను చూడండి. దయచేసి సినిమాలోని సీక్రెట్లు, ట్విస్ట్‌లను రివీల్ చేయకండి.. స్పాయిలర్‌లను ఆపండి.. ఇది మీడియా, ప్రేక్షకులు, అభిమానులను మేం రిక్వెస్ట్ చేస్తున్నాము అని అన్నారు.

మీరు (అభిమానులు) వార్ 2ని మొదటిసారి చూసినప్పుడు అనుభవించినంత ఆనందం, థ్రిల్, వినోదాన్ని మిగతా వారు కూడా అనుభవించాలి. స్పాయిలర్లు సీక్రెట్లు, ట్విస్టులు రివీల్ చేయడం వల్ల మిగతా వాళ్లకు ఆ అనుభూతి, అనుభవం ఉండదు. దయచేసి వార్ 2 కథను రహస్యంగా ఉంచండి అని ఎన్టీఆర్ తెలిపారు. వార్ 2 రేపు (ఆగస్ట్ 14) ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది.

Let the story of War 2 be a secret to everyone:

Let the story of War 2 be a secret to everyone!- Hrithik & NTR urge everyone to protect War 2 spoilers ahead of its release tomorrow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs