Advertisement
Google Ads BL

అమరావతి-బసవతారకం ఆసుపత్రి శంకుస్థాపన


హైదరాబాద్ లో ఎన్టీఆర్  బసవతారం క్యాన్సర్ ఆసుపత్రి ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్‌ కేర్‌ క్యాంపస్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన భూమి పూజను అమరావతి తుళ్లూరు సమీపంలో బుధవారం ఉదయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

ఈ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రెండు దశల్లో నిర్మాణం జరగనుంది. రాజధానిలో 21 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్‌ కేర్‌ క్యాంపస్‌లో సమగ్ర క్యాన్సర్‌ చికిత్స, పరిశోధనతోపాటు.. రోగుల సంరక్షణకు ఎక్స్‌లెన్సీ సెంటర్‌ అందుబాటులోకి తెస్తారు. తొలి దశలో 500 పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలు అందిస్తారు. రూ.750 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు, అధునాతన పరికరాలు సమకూరుస్తారు. 

వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స తదితర ప్రక్రియలకు ఇంటిగ్రేటెడ్‌ కేర్‌ మోడల్‌తో ఏర్పాటుచేసి.. 2028 నాటికి శస్త్రచికిత్సలు ప్రారంభించాలని భావిస్తున్నారు. రెండో దశలో పడకల స్థాయి వెయ్యికి పెంచుతారు. ప్రత్యేక విభాగాలు, పరిశోధన విభాగాల ఏర్పాటు, క్లిష్టమైన, అధునాతన క్యాన్సర్‌ కేసులకు ప్రాంతీయ రిఫరల్‌ కేంద్రంగా దీనిని తీర్చిదిద్దుతారు.

Balakrishna Lays Foundation Stone for Basavatarakam Cancer Hospital in Amaravati:

 Balayya Lays Foundation For Basavatarakam at Amaravati
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs