యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్2 ఆగష్టు 14 న పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతుంది. తాజాగా హైదరాబాద్ లో వార్2 ప్రీ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. వార్ 2 ఈవెంట్ లో ఎన్టీఆర్ తన ఫ్యామిలీ అలాగే అభిమానులను ఉద్దేశించి స్వీట్ కామెంట్స్ చేసారు..
నిన్ను చూడాలని చిత్రంతో నా కెరీర్ మొదలైంది. స్వర్గీయ రామోజీరావు గారు నన్ను పరిచయం చేశారు. అప్పుడు మా నాన్న గారు, అమ్మ గారు తప్ప ఇంకెవ్వరూ నా పక్కన లేరు. ఆధోని నుంచి ముజీబ్ అనే అభిమాని మొదటగా వచ్చారు. అలా మొదలైన నా జర్నీలో ఇప్పుడు ఇంత అభిమానులు దొరికారు. అభిమానుల నుంచి ఇంత ప్రేమ దొరకడం నా పూర్వ జన్మ సుకృతం. ఇన్నేళ్లలో నాతో ఎంతో మంది అభిమానులు కలిసి వస్తున్నారు.
దీనంతటికి కారణమైన కీర్తి శేషులు మా తండ్రి హరికృష్ణ గారికి, మా అమ్మ శాలిని, మా అమ్మ లక్ష్మీ గారికి, మా అన్న కీర్తి శేషులు జానకీ రామ్, ఇంకో అన్న కళ్యాణ్ రామ్ గారికి ధన్యవాదాలు. విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ, నటరత్న, పద్మశ్రీ డా. నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు. రత్నల్లాంటి ఇద్దరు పుత్రుల్ని ఇచ్చిన నా భార్య ప్రణతికి, పెద్ద కొడుకు అభయ్, చిన్న కొడుకు భార్గవ్‌కి నమస్కారాలు అంటే బాగుండదు కానీ హగ్స్ ఇస్తాను (నవ్వుతూ).
ఒక తల్లికి పుట్టకపోయినా, నన్ను కడుపులో పెట్టుకుని, నా బాధలో పాలు పంచుకునే, ఆనందంలో ఆనందాన్ని పంచుకునే, నేను నా ఇంట్లో సుఖంగా పడుకున్నా.. అభిమానులకు ఎంత చేసినా, ఏం చేసినా రుణం తీర్చుకోలేను.. అంటూ ఎన్టీఆర్ వార్ 2 ఈవెంట్ లో ఎమోషనల్ అయ్యారు.