ఓవైపు స్టార్ హీరో ధనుష్ తో డేటింగ్ చేస్తోంది అంటూ మృణాల్ పై కామెంట్లు వినిపిస్తున్నాయి. తమిళ స్టార్ హీరో ధనుష్ తో ఒక్క సినిమాలో అయినా నటించకుండానే, అతడితో సాన్నిహిత్యం చర్చగా మారింది. సోషల్ మీడియాల్లో నెటిజనుల కామెంట్లు వేడెక్కిస్తున్నాయ్. ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందనే పుకార్లు ఇప్పటికీ ఆగలేదు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. తన గురించి రాసేవాళ్లు ఆలోచించుకోవాలని సైలెంట్ గా చురకలు వేసారు. సినిమా కెరీర్ అయినా, వ్యక్తిగత జీవితం గురించి రాసినా తాను అంతగా పట్టించుకోనని మృణాల్ అన్నారు. ఎఫైర్ గాసిప్పులపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది మృణాల్..
ప్రస్తుతం ధనుష్ తో డేటింగ్ లో ఉందన్న ప్రచారం సాగుతుండగానే, ధనుష్ సిస్టర్స్ కార్తీక, విమల గీతను మృణాల్ సోషల్ మీడియాలో ఫాలో చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ధనుష్ తో సాన్నిహిత్యాన్ని మృణాల్ ధృవీకరించిందని అంతా భావిస్తున్నారు. ధనుష్ కుటుంబంతో మృణాల్ ఎంతో సన్నిహితంగా కలిసిపోతోందని కామెంట్ చేస్తున్నారు. అయితే దీనిపై మృణాల్ స్పందించాల్సి ఉంది. ఐశ్వర్యకు ధనుష్ విడాకులిచ్చిన తర్వాత మృణాల్ తో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నాడనే వార్తల నడుమ మృణాల్ ప్రతి యాక్టివిటీ పైనా ఆసక్తికర చర్చ సాగుతోంది.