కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అంచెల వారీగా కష్టపడుతుంది. ఏడాది కాలంగా సూపర్ సిక్స్ లోని హామీలను అమలు పరుస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం. ఏపీ ప్రజలకు ముఖ్యంగా మహిళల పట్ల కూటమి ప్రభుత్వం చూపించే బాధ్యత పట్ల ఏపీ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారం చేపట్టగానే పెంచిన పెన్షన్స్ తో ప్రజలకు ముఖ్యంగా వృద్దులకు ఎంతో మేలు చేసిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత విడతల వారీగా దీపం పథకం, మెగా డీఎస్సీ, తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేసింది.
ఇప్పుడు సూపర్ సిక్స్ లోని మరో అతి కీలకమైన పథకం అమలుకు కూటమి ప్రభుత్వం స్వీకారం చుట్టుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ మహిళలకు ఉచిత బస్సు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టుగా మటిచ్చినట్టుగా ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం నుంచి ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం మొదలు పెట్టనుంది. ఈ పథకానికి స్త్రీశక్తి పథకం అని నామకరణం చేసారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జారీచేసే టికెట్లపై స్త్రీశక్తి అని ముద్రణ ఉంటుంది. ఇప్పటికే మహిళలకు జీరో ఫేర్ టికెట్ జారీ కోసం ఏర్పాట్లు పూర్తిచేసింది ఆర్టీసీ. ఆర్టీసీ సిబ్బంది వినియోగించే టిమ్స్ యంత్రాలు, యూటీఎస్ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేపట్టారు. జీరో ఫేర్ టికెట్లు ఎలా జారీ చేయాలో తెలుపుతూ నేటినుంచి సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.
అన్ని బస్ డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్న ఆర్టీసీ అధికారులు. మహిళలకు ఇచ్చే టికెట్ పై ఛార్జీ, ఇచ్చిన రాయితీ వివరాలు ముద్రించనున్న ఆర్టీసీ, మహిళలకు ఇచ్చే టికెట్ పై ఛార్జీ, ఇచ్చిన రాయితీ వివరాలు ముద్రించనున్నారు. జీరో ఫేర్ టికెట్లు వేగంగా జారీ అయ్యేలా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసారు. ఆగస్టు 15నుంచి అమల్లోకి రానున్న స్త్రీశక్తి పథకం అమలులోకి రానుంది.