చాలామంది నటులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు. అందుకే సినిమాల్లో నటిస్తూనే మరోపక్క ఆ క్రేజ్ తో బిజినెస్ లు స్టార్ట్ చేసిన నటులు ఎక్కువమందే ఉన్నారు. కింగ్ నాగార్జున దగ్గర నుంచి చాలామంది హీరోలు, రకుల్ ప్రీత్ నుంచి సమంత వరకు హీరోయిన్స్ కూడా చాలామంది వ్యాపార రంగంలో రాణిస్తున్న వారే.
ఇప్పుడు వ్యాపార రంగంలోకి మరో క్రేజీ హీరోయిన్ ఎంటర్ అవ్వబోతున్నట్లుగా ఆమె స్వయంగా తెలిపింది. ఆమె ఎవరో కాదు ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ కి క్రేజీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న. వరస హిట్ చిత్రాలతో మంచి ఫామ్ లో ఉన్న రష్మిక మందన్న ఇలాంటి క్రేజీ సమయంలోనే బిజినెస్ లోకి ఎంటర్ కాబోతుంది.
రష్మిక తన జీవితంలో టార్నింగ్ పాయింట్ గురించి చెబుతూ.. తాను త్వరలో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నట్లుగా చెప్పడమే కాదు.. ఈ రోజు నేను చాలా చాలా ముఖ్యమైన దాని కోసం షూటింగ్ చేయబోతున్నాను.. నువ్వు చెప్పినట్టే నేను ప్రారంభించబోయే వ్యాపారానికి సంబంధించిన షూట్ చేసాను! అంటూ తన తల్లికి రష్మిక వెల్లడించింది.
అయితే రష్మిక చెయ్యబోయే ఆ వ్యాపారం ఏమిటి అనేది మాత్రం రివీల్ చెయ్యలేదు. మరి సమంత లా వస్త్ర వ్యాపారంలోకి వస్తుందా, లేదంటే రకుల్ లా జిమ్ వ్యాపారంలోకి అడుగుపెడుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.