ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విజయవంతంగా సుపరిపాలన వైపు అడుగులు వేస్తూ ఏడాది పాలనా పూర్తి చేసుకుంది టీడీపీ ప్రభుత్వం. 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా సూపర్ 6 పథకాల్ని ప్రజలకు విఆటలా వారీగా టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటి, విద్య శాఖల మినిస్టర్ నారా లోకేష్ నాయకత్వంలో టీడీపీ కార్యకర్తలు నూతనోత్సాహంతో పని చేస్తున్నారు. ఒకవైపు సంక్షేమాన్ని అందిస్తూనే మరోవైపు నవ్యాంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు విజన్ 2047తో దూసుకుపోతోంది తెలుగుదేశం ప్రభుత్వం.
టీడీపీ పార్టీ అధికారం లో ఏడాది పూర్తి చేసుకున్న ఈ శుభ తరుణంలో ఏడాది ప్రజాపాలన గురించి, జరుగుతన్న సంక్షేమ పథకాలపై, అందుకున్న విజయాల గురించి ప్రజలకు వివరిస్తూనే.. అసలు తెలుగు దేశం ప్రభుత్వ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాలు వారికి అందుతున్నాయా లేదా, ఇంకా ఈ ప్రజా ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు లాంటి అంశాల గురించి తెలుసుకునేందుకు సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ.
జులై 2న కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంగళగిరిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. నారా లోకేష్ స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో, అలాగే తమ పాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు
50 లక్షలకు పైగా ఇళ్లు, అన్ని నియోజకవర్గాల్లో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం
సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ సంక్షేమం, అభివృద్ధి విజన్‌ను వివరిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు తమ పరిధిలోని ప్రతీ ఇంటికి వెళ్తున్నారు. ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరిస్తున్నారు. అంతేకాకుండా... ఆయా కుటుంబాలకు అందుతున్న పథకాల గురించి కూడా తెలుసుకుని... ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి పథకాల్ని, కార్యక్రమాలను ఆశిస్తున్నారు లాంటి అంశాల్ని కూడా నమోదు చేసుకుంటున్నారు. మొత్తంగా ఈ 18 రోజుల్లో 50 లక్షలకు పైగా ఇళ్లను సందర్శించి సరికొత్త రికార్టుని సృషించారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. తద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ మరోసారి నిరూపించినట్లైంది.
సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు పింఛన్లు, మెగా డీఎస్సీ, తల్లికి వందనం, అన్న క్యాంటీన్లు, దీపం 2 పథకం వంటి వాటిగురించి ప్రజలకు వివరిస్తున్నారు.
* ఆ ప్రాంతంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్ని తెలియజేస్తున్నారు.
* ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు గురించి చెపుతున్నారు.
* పెట్టుబడుల ద్వారా మన యువతకు అందివస్తోన్న ఉద్యోగాకవకాశాలు తెలియజేస్తున్నారు.
* ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అన్నది ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు.
* రాబోయే నాలుగేళ్లలో చేపట్టబోయే అభివృద్ధి చర్యలను వివరిస్తున్నారు
* ప్రభుత్వం నుంచి ప్రజలు ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఆశిస్తున్నారో తెలుసుకుంటున్నారు.
*మూడు ప్రాంతాలు.. మూడు కరపత్రాలు*సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టింది తెలుగుదేశం పార్టీ. ఆయా ప్రాంతాల్లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి వివరిస్తూ, దీంతోపాటు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాల్ని కూడా ఒక కరపత్రం రూపంలో సిద్ధం చేసి ప్రజలకు అందించింది. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ....ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు విడివిడిగా కరపత్రాల్ని సిద్ధం చేసి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చాలా స్పష్టంగా తెలిసేలా చేసింది తెలుగుదేశం పార్టీ.
ప్రతీ ఒక్కరూ కచ్చితంగా డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే
తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. ఇక్కడ కార్యకర్తే అధినేత. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్క కార్యకర్త ఉత్సాహంగా పాల్గొన్నారు. అందుకే వారికి మరింత ప్రోత్సాహన్ని అందించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంగళగిరిలో సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం మొదలైన దగ్గరనుంచి ఈరోజు వరకు ప్రతీరోజూ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో నారా లోకేష్ మాట్లాడారు. వారిని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు నిరంతరంగా లోకేష్ కృషి చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పనిచేసిన కార్యకర్తల్ని, నాయకుల్ని మంత్రి నారా లోకేష్ పేరు పేరునా అభినందిస్తున్నారు. వారందరికీ మీ వెనుక నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. ఏ చిన్న సమస్య రాకుండా టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే తెలుసుకుని దాన్ని పరిష్కరిస్తున్నారు. మరోవైపు మంత్రులు కూడా దాదాపు 80 నుంచి 85 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కార్యక్రమాన్ని లోకేష్ రూపొందించారు.
డోర్ టు డోర్ కార్యక్రమం జరుగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డు ద్వారా పర్యవేక్షణ
సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యొక్క CUB (క్లస్టర్, యూనిట్, బూత్) నాయకుల దగ్గరనుంచి, కుటుంబ సాధికార నాయకులు, పోలిట్ బ్యూరో వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఎప్పటికప్పుడు SMSలు, IVRSల ద్వారా అలర్ట్ చేశారు. అంతేకాకుండా వారు ఎన్ని ఇళ్లకు వెళ్లారు అనే విషయాన్ని సాయంత్రానికి డ్యాష్ బోర్డ్ లో అప్డేట్ అయ్యేలా చూశారు. దీనిద్వారా తక్కువ రోజుల్లోనే ఎక్కువ ఇళ్లని కవర్ చేయగలిగారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.
స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర పునర్నిర్మాణాన్ని తలకెత్తుకున్న తెలుగుదేశం ప్రభుత్వ నిబద్ధతకు ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఒక అద్బుతమైన నిదర్శరనం. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు ప్రత్యక్షంగా తెలియజేయడం ద్వారా ప్రజల నమ్మకాన్ని మరింత పొందే విధంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరుగుతోంది.