ఒకప్పుడు సినిమా విడుదలైన రోజు సినిమా బాగోపోతే.. టాక్ అంతగా స్ప్రెడ్ అయ్యేది కాదు, అందులోను వీకెండ్ అంటే శని,ఆదివారాలు సినిమా టికెట్ బుకింగ్స్ బావుండేవి. సినిమా టాక్ తో సంబంధం లేకుండా టికెట్ బుకింగ్స్ శనిఆదివారాలు కళకళలాడేవి. పెద్ద సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా మొదటివారం బుకింగ్స్ కనిపించేవి.
కానీ ఇప్పుడు ఈమధ్య కాలంలో సినిమా టాక్ కోసమే ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. సినిమా విడుదలైన నెక్స్ట్ మినిట్ లోనే టాక్ స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ట్వీట్లు వేస్తున్నారు. సినిమాకి నెగెటివ్ టాక్ వస్తే ఇక ఆ సినిమా షెడ్డుకే. అంటే అట్టర్ ప్లాప్ లిస్ట్ లోకి వెళ్లిపోవడమే.
సోషల్ మీడియా పుణ్యమా భారిగా డబ్బుపెట్టిన సినిమా కి నెగెటివ్ టాక్ వస్తే అది డిజాస్టర్ అయిపోతుంది. సోషల్ మీడియాలో ఆ సినిమాని చీల్చి చెండాడుతున్నారు. అందులోను మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా బాలేదు అంటే ఇక థియేటర్స్ కి జనాలు కదలడం లేదు. ఇక సినిమాకి హిట్ టాక్ వస్తే తప్ప థియేటర్స్ కి ప్రేక్షకులు రావడం లేదు.
వీకెండ్ అయినా, ఏదైనా సినిమా బుకింగ్స్ మందకొడిగా కనిపిస్తున్నాయి తప్ప స్టార్ హీరోల సినిమాలకు కాస్తోకూస్తో బుకింగ్స్ ఉన్నా.. మీడియం రేంజ్ హీరోలు పరిస్థితి దారుణంగా తయారైంది. నాగ చైతన్య, నితిన్, శర్వానంద్, నాని ఇలా మీడియం రేంజ్ హీరోలకు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయితే ఆ సినిమా థియేటర్స్ లో జనాలు కానరావడం లేదు. వీకెండ్ లేదు, ఫెస్టివల్ సీజన్ లేదు సెలవు రోజు కాదు.. అస్సలు ఆ సినిమా చూసేందుకు ప్రేక్షకులు మొగ్గు చూపడమే లేదు. మరి ఇలాంటి పరిస్థితి నుంచి సినిమా ఎలా సేవ్ అవుతుందో అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.