సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ కూలీ. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్‌తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు.
మోనికా అనే ఈ పాట ఎక్స్‌ప్లోజివ్ నెంబర్ గా అదరగొట్టింది. సముద్ర నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ పాటలో పూజా హెగ్డే రెడ్ కలర్ డ్రెస్ లో, ప్రతి ఫ్రేమ్‌ను తన అద్భుతమైన మూవ్స్ తో కట్టిపడేసింది. ఆమెతో పాటు సౌబిన్ షాహిర్ కూడా కనిపించడం ట్రాక్‌కు ఫన్ ఎనర్జీ తీసుకువచ్చింది.
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మరో చార్ట్‌బస్టర్‌ను కంపోజ్ చేశారు. అనిరుధ్, శుభలక్ష్మి కలసి హై ఎనర్జీతో పాడిన ఈ సాంగ్ లో అసల్ కోలార్ రాప్ ఫ్రెస్ నెస్ యాడ్ చేసింది.
ఆగస్టు 14న గ్రాండ్ పాన్-ఇండియా విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం హాలీడే వీకెండ్ కి పర్ఫెక్ట్ టైం.