ఒకప్పుడు టాలీవుడ్ లో బుట్టబొమ్మ పూజ హెగ్డే హవా మాములుగా లేదు. స్టార్ హీరోలందరితో జోడికట్టింది. బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఆడిపాడింది. కానీ గత రెండుమూడేళ్లుగా పూజ హెగ్డే టైమ్ అస్సలు బాగోలేదు. సౌత్ లో ఆమె ఏ మూవీ చేసినా అది ప్లాప్ అవుతుంది. ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అనుకున్న పూజ హెగ్డే ఇప్పుడు ఐరెన్ లెగ్ గా మారడమే కాదు టాలీవుడ్ కి ఆల్మోస్ట్ దూరమైంది.
ప్రస్తుతం తమిళనాట పూజ హెగ్డే స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నా అమ్మడు కి సక్సెస్ మాత్రం రావడం లేదు. అలాంటి సమయంలో పూజ హెగ్డే కు తెలుగు ఆఫర్ వచ్చింది అనే వార్త పూజ హెగ్డే అభిమానులను ఎగ్జైట్ చేసింది. అది మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు దర్శకుడితో తెలుగు స్ట్రయిట్ మూవీ ఒకటి చేస్తున్నారు.
ఆ చిత్రంలోనే దుల్కర్ కి జోడిగా పూజ హెగ్డే నటించనుంది అని సమాచారం. మలయాళ హీరో అయినా దుల్కర్ చేస్తుంది తెలుగు సినిమానే కాబట్టి పూజ హెగ్డే కి నిజంగా అందులో అవకాశం వస్తే మళ్ళి టాలీవుడ్ కి బిగ్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టే.