వర్జిన్ బాయ్స్ చిత్రం రివ్యూ
దయానంద్ రచనా దర్శకత్వంలో రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్ పై రాజా దారపునేని నిర్మాతగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో దయానంద్, మిత్ర శర్మ, శ్రీహాన్, జెనీఫర్, రోనీత్, కౌశల్, బబ్లు తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ నటించారు. స్మరణ్ సాయి సంగీతాన్ని అందించగా వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ చేశారు. ఇక ఈ చిత్ర దివ్య విషయానికొస్తే...
కథ :
ముగ్గురు యువకులు (గీతానంద్, శ్రీహాన్, రోనీత్) తమ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆ వయసులో వచ్చే ఫీలింగ్స్ ను బట్టి తమ కన్యత్వాన్ని కోల్పోయే ఛాలెంజ్ తీసుకుంటారు. తాము అనుకున్నట్లు తమ వర్జినిటీ పోగొట్టుకొని దిశగా గర్ల్ ఫ్రెండ్స్ ను వెతుక్కుంటూ మరో ముగ్గురు అమ్మాయిలతో (మిత్ర శర్మ, జెన్నీఫర్, అన్షుల) పరిచయం ఏర్పడుతుంది. అయితే అలా పరిచయమైన వారి ఫ్రెండ్షిప్ ఎటువంటి మలుపులు తిరుగుతుంది? మా ఫ్రెండ్ షిప్ కేవలం వారు అనుకున్న ఛాలెంజ్ ను గెలిచేందుక లేక మనస్ఫూర్తిగానే వారితో ఫ్రెండ్షిప్ చేస్తారా? అసలు ఆ ఫ్రెండ్షిప్ అక్కడితో ఆగుతుందా లేదా ప్రేమ బంధం గా మారుతుందా? వారి మధ్య ఎటువంటి మనస్పర్ధలు వస్తాయి? వారి జీవితాల్లోకి కౌశల్, బబ్లు తదితరులు ఎలా వస్తారు? వారి వల్ల వీరి జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతాయి? అనే అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండి తలపై ఈ చిత్రం చూడాల్సిందే.
నటీనటుల నటన :
చిత్రంలో ముఖ్యపాత్రుల పోషించిన గీతానంద్, మిత్ర శర్మ ఈ చిత్రంలో ఒక జంటగా కనిపిస్తారు. అలాగే శ్రీహాన్, జెన్నీఫర్ మరో జంటల కనిపిస్తారు. రోనిత్, అన్షుల ఇంకొక జంట. అయితే ప్రతి ఒక్కరు కూడా ఒకరికి ఒకరు పోటీగా చిత్రంలో నటించడం జరిగింది. మిత్ర శర్మ అటు గీతానంద్ పై ప్రేమ చూపిస్తూనే మరోవైపు తన హద్దు దాటకూడదని ఒక లైన్ లో ఉండే తన పాత్రను అద్భుతంగా చేశారు. గీతా ను మెచ్యూరిటీ ఉన్న ఒక యువకుడిలా చక్కటి పర్ఫామెన్స్ ఇచ్చారు. శ్రీహన్, జెన్నీఫర్, రోనీత్, అన్షుల తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు బోనస్ గా నిలిచారు. బబ్లు, కౌశల్ తదితరులు సినిమాలో కనిపించే సమయం తక్కువైనప్పటికీ తమ పాత్రలతో మంచి ఇంపాక్ట్ సృష్టించారు.
సాంకేతిక విశ్లేషణ :
యువతను టార్గెట్ గా చేసిన ఈ సినిమా అటు ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా నడిపిస్తూ పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడు దయానంద్ తాను రాసుకున్న కథను తెరపై చూపించడంలో ఎక్కడ తగలబడకుండా విజయం సాధించారు. సినిమాలోని ప్రతి పాట చాట్బస్టార్ ల నిలిచాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సీన్లకు తగ్గట్లు కరెక్టుగా పండింది. వెండి ధరపై సినిమాని చూస్తుంటే నిర్మాణ విలువలు అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. సినిమాలోని మాటలు, డైలాగులు అదరగొట్టాయి. సినిమాలోని చాలా వంతు కాలేజీ ఇంకా కొన్ని పరిమిత లొకేషన్స్ లో తీస్తూ బ్యాగ్రౌండ్ ఇంకా కలరింగ్ను బ్యాలెన్స్ చేస్తూ కన్నుల విందును అందించారు. టెక్నికల్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.
చిత్ర విశ్లేషణ :
ముందుగా ఈ సినిమా టైటిల్ కథకు తగ్గట్లు కరెక్ట్ గా సెట్ అయిందని చెప్పుకోవాలి. సినిమాలోని మొదటి హాఫ్ అంత కాస్త అడల్ట్ డైలాగులతో ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఎంతో ఎంగేజింగ్ గా కుటుంబ ప్రేక్షకులను సైతం కూర్చున్న పెట్టేలా ఉంటుంది. సినిమా ఏ సర్టిఫికెట్ అయినప్పటికీ నేటి యువతకు అర్థమయ్యే విధంగా ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా ఉంది. స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉన్నప్పటికీ నటీనటులు తమ నటనతో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం వల్ల ఎక్కడ బోర్ అనిపించదు. కొంచెం డబ్బింగ్ లో అటు ఇటుగా ఉన్నప్పటికీ డైలాగ్స్ లోని లోతు అద్భుతంగా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
కథ, నటీనటుల నటన, డైలాగ్స్, సినిమాకు పాటలు బోనస్.
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉండటం, డబ్బింగ్.
సారాంశం :
యువతతో పాటు కుటుంబంలోని పెద్దలు అంతా చూసి నేటి ప్రేమ, ఇతర వ్యవహారాలను అర్థం చేసుకునే విధంగా ఒక మంచి మెసేజ్ తో యూత్ ను ఎంగేజ్ చేసేలా సినిమా అద్భుతంగా ఉంది.
రేటింగ్: 2.5/5