divvala madhuri On her film debut
in /home/cinejosh/public_html/news_story_telugu_amp.php on line 117దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి రీల్స్ చేస్తూ డాన్స్ వేస్తూ వకుళ సిల్క్స్ బట్టల షాప్ ఓపెన్ చేసిన దివ్వెల మాధురి సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అనేది అందరికి తెలుసు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణికి విడాకులిచ్చి దివ్వెల మాధురి తో కలిసి ఉండడమే కాదు ఆదర్శ దంపతుల్లా వారిద్దరూ కనిపించే తీరుకు లోకమే ఆశ్చర్యపోతుంది.
ఇక రీసెంట్ గా మీ డాన్స్ లు, రీల్స్ వల్లే దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించారు అంటూ ఓ యాంకర్ అడగగానే దానికి దివ్వెల మాధురి రోజా డాన్స్ చెయ్యడం లేదా, రీల్స్ చెయ్యడం లేదా, రికార్డింగ్ డాన్స్ లు చేసుకునే శ్యామల కు ఏం హోదా ఉంది అని ఆమెకు అధికార ప్రతినిధి పోస్ట్ ఇచ్చారు అంటూ ఆమె యాంకర్ పై రెచ్చిపోయింది.
తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డాన్స్, రీల్స్ చూస్తే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారేమో అనుకున్నాము అంటే.. త్వరలోనే సినిమాల్లోకి వస్తాను, నాకు విలన్ రోల్స్ చెయ్యడమంటే చాలా ఇష్టం అంటూ దివ్వెల మాధురి తన సినిమా ఎంట్రీ పై రియాక్ట్ అయ్యింది. మరి ఈ సోషల్ మీడియా క్వీన్ ఎప్పుడు సినిమాలో కనిపిస్తుందో చూడాలి