సినిమాను సినిమాగా తీసే దమ్మెంత మందిలో ఉంది? పాన్ ఇండియా స్టార్లను కాదు..లోకల్ స్టార్లతో పాన్ ఇండియా తీసే సత్తా..సత్తువా ఎవరి సొంతం? వాళ్లే ఇండస్ట్రీలో కింగ్ మేకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు దిల్ రాజు. పాన్ ఇండియా సక్సెస్ లకు సంబంధించి రాజుగారు గొప్ప విశ్లేషణ చేసారు. ఈ నేపథ్యంలో రాజుగారు కొన్ని పాన్ ఇండియా సక్సెస్ లు గురించి పూస గుచ్చినట్లు వివరించారు. పుష్ప ది రైజ్ లో ఎవరూ పాన్ ఇండియా స్టార్లు కాదు. మరి ఆ సినిమా ఆడిందిగా.
అంతకు ముందు బాహుబలి ది బిగినింగ్ పాన్ ఇండియాని షేక్ చేసింది. రాజమౌళి అప్పుడు బాహుబలి తీసినప్పుడు వాళ్లెవ్వరూ పాన్ ఇండియా స్టార్లు కాదు కదా. కానీ ఆడింది కదా. కేజీఎఫ్ మొదటి భాగం. అందులో ఆర్టిస్టులు ఎవరో కూడా తెలియదు. అప్పుడు యశ్ కూడా కొత్త నటుడే. ఈ సినిమాలన్నీ పాన్ ఇండియాలో ఓ సంచలనం. ఇవన్నీ ఎవరున్నారని ఆడాయి? అందులో పాన్ ఇండియా ఆర్టిస్టులు ఎక్కడా లేరు. మనం మార్కెటింగ్ స్రాటజీ కోసం వాళ్లను పెడదాం? వీళ్లను తీసుకొద్దాం? అని రకరకాలుగా ఆలోచన చేస్తారు.
ఇక్కడ థింకింగ్ ప్రాసస్ లోనే తప్పుంది. సినిమాను సినిమాగా తీసి దాన్ని పాన్ ఇండియాకు తీసుకెళ్లాలి. తర్వాత నా ప్రాజెక్ట్ ప్లానింగ్ ఇలాగే ఉంటుంది. నేను కథకు కావాలని పాన్ ఇండియా ఆర్టిస్టులను తీసుకు రాను. ఈ కారణంగా సినిమాను డిలే చేసుకోవాల్సిన అవసరంలేదు. నా ఫార్ములా ఏంటంటే? ప్రాజెక్ట్ డిలే అవ్వకూడదు. ఆరు నెలల్లో సినిమా అయిపోవాలి. ఎనిమిది నెలల్లో సినిమా రిలీజ్ అవ్వాలి. ఇలా చేయగ లిగితేనే అన్ని రకాలు వృద్ధా ఖర్చు అన్నది అదుపులో ఉంటుంది. వడ్డీల భారం తగ్గుతుంది.
ఇండియన్ సినిమా పుట్టినప్పటి నుంచి ఓ ప్రోసస్ ఉంది. ఇప్పుడా ప్రోసస్ ని కకావికలం చేసేసారు. ఎవరు సినిమా తీసినా బేసిక్స్ ముఖ్యం. ఏఐ ఇప్పుడు చేస్తోందంతా బేసిక్స్ మాత్రమే. మా లార్విన్ లో ప్రోసస్ ఇలాగే ఉంటుంది. నా ఐడియాకు ఓ టీమ్ అంతా యాడ్ అవ్వడంతో లార్విన్ పుట్టింది. ఇలా ఓ కంపెనీ ఫాం అయింది. లార్విన్ ఏఐలో మేము ఇంకా ఏం! సాధించాలేదు. సాధించాల్సి ఉంది` అని అన్నారు.