Advertisement
Google Ads BL

ఇదంతా వేణు బ్యాడ్ లక్


జబర్దస్త్ లో ఫేమస్ అయ్యి ఆతర్వాత ఇతర షోస్ తో పేరు తెచ్చుకున్న నటుడు వేణు వెలదిండి .. బలగం చిత్రంతో దర్శకుడిగా బలమైన ముద్ర వేసాడు. బలగం చిత్రంతో వేణు దర్శకత్వాన్ని అందరూ పొగడడమే కాదు, అదే దిల్ రాజు బ్యానర్ లో వేణు కి రెండో సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ హీరోలే వేణు కి హ్యాండ్ ఇస్తున్నారు.

Advertisement
CJ Advs

హీరో నాని తో వేణు ఎల్లమ్మ చిత్రం చేయాలనుకున్నారు. కానీ నాని అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. ఆ ఎల్లమ్మ స్క్రిప్ట్ తో వేణు నితిన్ ని లైన్ లో పెట్టుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో నితిన్ తో తమ్ముడు తెరకెక్కించగా ఆ చిత్రం రీసెంట్ గా విడుదలై షాకిచ్చింది. దానితో వేణు ఎల్లమ్మ ప్రాజెక్ట్ పై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి.

నితిన్ వరస డిజాస్టర్స్ లో ఉన్న హీరో. ఆ హీరోపై ఎక్కువ బడ్జెట్ పెట్టి వేణు తో ఎల్లమ్మ తియ్యడం దిల్ రాజు కి  కష్టం. ఎల్లమ్మ బడ్జెట్ బలగం చిత్రాన్ని డబుల్ కాదు త్రిబుల్ అవ్వడమే అందుకు కారణం. అంత బడ్జెట్ నితిన్ పై పెట్టి చేతులు కాల్చుకోవడం కష్టమనే భావనలో దిల్ రాజు ఉన్నట్లుగా టాక్.

మరి ఇదంతా వేణు బ్యాడ్ లక్ అనే చెప్పాలి. బలగం చిత్రం సక్సెస్ తర్వాత అదే బ్యానర్ తో మరో మీడియం హీరోతో సెకండ్ ప్రాజెక్ట్ ని రెడీ చేసుకున్న వేణుకు ఏళ్లతరబడి బ్రేక్ వచ్చేస్తుంది. 

Its Badluck for director venu:

Will Yellamma hit floors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs