మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మూడో పెళ్లి గురించి ప్రజలకు అంతగా స్పష్ఠత లేదు. ఆయన సన్నిహితులు కూడా డైలమాలోనే ఉన్నారు. రీనా దత్తా, కిరణ్ రావు ఇద్దరికీ అమీర్ విడాకులిచ్చాడు. ఇప్పుడు షష్ఠిపూర్తి (60) వయసులో బెంగళూరుకు చెందిన నడి వయసు యువతి గౌరీ స్ప్రాట్ తో నిండా ప్రేమలో మునిగాడు. అమీర్ ప్రేమను చూసి పాపం పసోడు! అంటూ జోకులేసుకుంటున్నారు. అయితే అతడు ఇవేవీ పట్టించుకునే మూడ్ లో లేడు. తనకు ఒక తోడు కావాలనుకున్నాడు. ప్రేమలో పడ్డాడు. అయితే ఈ జంటకు పెళ్లయిందా? కలిసే ఉంటున్నారా? ప్రతి ఈవెంట్లో అమీర్ తో పాటు గౌరీ స్ప్రాట్ కూడా కనిపిస్తున్నారు కదా! దీనర్థం వారికి పెళ్లయినట్టేనా?
ఇలాంటి సందేహాలెన్నో అభిమానులను నిలవనీయడం లేదు. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సమాధానాలిచ్చాడు. `గౌరీ నేను ఒకరినొకరు సీరియస్‌గా తీసుకుంటాము. మేం చాలా నిబద్ధతతో ఉన్నాం. మీకు తెలుసో తెలీదో.. మేం భాగస్వాములం.. కలిసే ఉన్నాము` అని వ్యాఖ్యానించాడు. `వివాహం అనేది ఒక అందమైన విషయం… నా హృదయంలో నేను ఇప్పటికే ఆమెను వివాహం చేసుకున్నాను కాబట్టి.. ఇది అధికారికం చేసుకోవాలా వద్దా? అనేది ముందుకు సాగే కొద్దీ నిర్ణయించుకుంటాం` అని అన్నారు.
బెంగళూరుకు చెందిన గౌరీ ఒంటరి. తన కుమారుడితో కలిసి జీవిస్తున్నారని కథనాలొచ్చాయి. అమీర్ ఖాన్ కి చెందిన ఓ కంపెనీలో గౌరీ ఉద్యోగి. అలా ఆ ఇద్దరి మధ్యా పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇప్పుడు ఈ జంట కలిసి ఉంటున్నారు. అమీర్ ఖాన్ మాటలను బట్టి.. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నాడా లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతానికి గౌరీ స్ప్రాట్ అమీర్ కి అన్నీ తానే అయింది.
ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో తనకు వయసయిపోయిందని అన్నాడు. 2021లో కిరణ్ రావు నుండి విడాకులు తీసుకున్న తర్వాత తాను మళ్ళీ ప్రేమలో పడాలనుకోవటం లేదని ఒప్పుకున్నాడు. నేను గౌరీని కలవడానికి ముందు వృద్ధాప్యంలో ఉన్నట్లు అనిపించింది... ఈ వయస్సులో నేను ఎవరిని కనుగొంటాను? అని అమీర్ సందేహించాడు. అయితే ఆ తర్వాత మానసికంగా థెరపీ సెషన్స్ తర్వాత దీని నుంచి బయటపడ్డానని అన్నాడు. గౌరీ, నేను పొరపాటున కలుసుకున్నాం. మేము కనెక్ట్ అయ్యాం.. స్నేహితులమయ్యాము.. ప్రేమలో పడ్డామని అమీర్ తెలిపాడు.