Advertisement
Google Ads BL

వీరమల్లు ట్రైలర్ తెచ్చిన డిమాండ్


పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా రూపొందించబడిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదు. ఈ చిత్రం నిజ జీవితంలోని ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగానూ తెరకెక్కలేదు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా ఇది తెరకెక్కింది.

Advertisement
CJ Advs

జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత హరి హర వీరమల్లు కథ పూర్తిగా మారిపోయింది. దర్శకుడు కథలోని స్ఫూర్తిని, సారాన్ని అలాగే ఉంచుతూ.. సరికొత్త కథగా దీనిని మలిచారు.

పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామిని శివుడు-మోహినిల కుమారుడిగా, శైవం మరియు వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో..  అలాగే హరి హర వీరమల్లును శివుడు మరియు విష్ణువుల అవతారంగా చూడబోతున్నాం.

హరి(విష్ణు) హర(శివుడు) అనే టైటిల్ ఈ చిత్ర సారాంశాన్ని తెలియజేస్తుంది. శివుడు, విష్ణువుల అవతారం వీరమల్లు అని తెలిపేలా ఈ చిత్రంలో పలు అంశాలను గమనించవచ్చు. విష్ణువు వాహనం గరుడ పక్షిని సూచించే డేగను ఈ చిత్రంలో ఉపయోగించారు. అలాగే, కథానాయకుడు తన చేతుల్లో శివుడిని సూచించే డమరుకం పట్టుకున్నాడు. ఈ చిత్రంలో కథానాయకుడు ధర్మాన్ని రక్షించడానికి మరియు ధర్మం కోసం పోరాడటానికి శివుడు, విష్ణువుల యొక్క రూపంగా కనిపిస్తాడు.

హరి హర వీరమల్లు సినిమాను ఎ.ఎం. రత్నం అత్యధిక బడ్జెట్ తో భారీస్థాయిలో నిర్మించారు. భారీ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన ఎ.ఎం. రత్నం.. గతంలో కూడా ఇలా అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలతో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. హరి హర వీరమల్లుపై కూడా ఆయన ఎంతో నమ్మకంతో ఉన్నారు. అందుకే ఓవర్సీస్, హిందీ తప్ప సినిమాకి సంబంధించిన మిగతా హక్కులను అమ్మడానికి ఎ.ఎం. రత్నం సిద్ధమవ్వలేదు. 

అసలే పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా, దానికితోడు సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో హరి హర వీరమల్లుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరినీ విశేషంగా ఆకట్టుకొని.. అంచనాలను రెట్టింపు చేసింది. దాంతో ఈ చిత్ర హక్కులను దక్కించుకోవడానికి తీవ్ర పోటీ నెలకొంది. ఎందరో పంపిణీదారులు ఇప్పటికే నిర్మాతను సంప్రదించారు. భారీ మొత్తాన్ని చెల్లించి, హక్కులను పొందేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. 

సినిమాని భారీస్థాయిలో రూపొందిస్తే.. హక్కుల రూపంలో ఉత్తమ ధరలను పొందగలమని నిర్మాతలు నమ్మారు. అందుకే ఎక్కడా రాజీ పడకుండా హరి హర వీరమల్లును అత్యంత భారీస్థాయిలో నిర్మించారు. నిర్మాతల నమ్మకం నిజమై.. చిత్ర పంపిణీ హక్కులు భారీ ధర పలుకుతున్నాయి. ప్రేక్షకులు కూడా వెండితెరపై ఈ చిత్రాన్ని చూసి అనుభూతి పొందటం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

Hari Hara Veera Mallu is an incarnation of Lord Vishnu and Shiva:

Hari Hara Veera Mallu Trailer Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs