Advertisement
Google Ads BL

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ ప్రూవ్ చేస్తుంది


కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని, హీరోలు అవసరం లేదని అన్నారు ప్రముఖ నటుడు శివాజీ రాజా. రేవు వంటి మంచి మూవీని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ వైల్డ్ బ్రీత్ ను ఈ రోజు యంగ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి హరినాథ్ పులి దర్శకత్వం వహిస్తున్నారు. డా.మురళీ చంద్ గింజుపల్లితో కలిసి పర్వతనేని రాంబాబు నిర్మిస్తున్నారు. వైల్డ్ బ్రీత్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు శివాజీ రాజా చేతుల మీదుగా లాంఛ్ చేశారు.  ఈ కార్యక్రమంలో నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరయ్యారు. పలువురు పాత్రికేయ మిత్రుల సమక్షంలో వైల్డ్ బ్రీత్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో

Advertisement
CJ Advs

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ - నాకు ఎంతో సన్నిహితులైన మీడియా మిత్రులు ఉన్నారు. నేను కెరీర్ ప్రారంభం నుంచీ వారితో స్నేహం చేస్తున్నా. అలాంటి మీడియా మిత్రుల్లో ఒకరైన పర్వతనేని రాంబాబు నిర్మాతగా వైల్డ్ బ్రీత్ సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ మధ్య కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలెన్నో విజయాలు సాధిస్తున్నాయి. వైల్డ్ బ్రీత్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగున్నాయి. పర్వతనేని రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయన నిర్మాతగా ఎన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నా. అలాగే దర్శకుడు హరినాథ్ పులి మంచి పేరు తెచ్చుకోవాలి. స్టార్స్ అవసరం లేదు. స్టార్స్ వెంట పడటం కాదు కథ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అన్నారు.

నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ - పర్వతనేని రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజున ఈ వైల్డ్ బ్రీత్ సినిమా ఫస్ట్ లుక్ లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. మన మీడియా ఫ్రెండ్స్ లో బీఏ రాజు గారు నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. రాంబాబు కూడా అలాగే ప్రొడ్యూసర్ గా ఎదగాలి. దర్శకుడు హరినాథ్ పులి చిన్నవాడు. అలాగే ఒదిగి ఉండి కష్టపడితే తప్పకుండా పైకి వస్తాడు. వైల్డ్ బ్రీత్ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - మన మిత్రుడు రాంబాబు ప్రొడ్యూసర్ గా వైల్డ్ బ్రీత్ అనే ఇంట్రెస్టింగ్ మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇన్ని రోజులు పాత్రికేయుడిగా మమ్మల్ని ప్రశ్నలు అడిగాడు. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారి తను నిర్మాత అనుభవాలు తెలుసుకుంటాడు. రేవు అనే మంచి చిత్రాన్ని ఇప్పటికే తను చేశాడు. ఈ వైల్డ్ బ్రీత్ సినిమా కూడా సక్సెస్ కావాలి. మీడియా మిత్రులంతా ఈ సినిమాకు మీ పూర్తి సపోర్ట్ అందించాలి అన్నారు.

నిర్మాత పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ - ఈ రోజు నా పుట్టినరోజు మీడియా మిత్రులు సన్నిహితులు పెద్దలు ఎంతోమంది విశెస్ చెప్పి ఇదొక ప్రత్యేకమైన రోజుగా మార్చారు. నాకు అన్ని విధాలా సహకరిస్తున్న మా నిర్మాత డా॥ మురళి గింజుపల్లి గారు నన్ను నమ్మి అంతా నాకు అప్పగించారు.  అంతే నమ్మకంగా అయనకు మంచి పేరు వచ్చే సినిమా ఆయనకు ఇస్తాను. నెక్స్ట్ ఈవెంట్ లో ఆయన వుంటారు. నిన్న గౌరవనీయ సీఎం చంద్రబాబు గారిని కలిశాను. ఆయనకు మా వైల్డ్ బ్రీత్ మూవీ గురించి వివరించాను. త్వరలోనే అపాయింట్ మెంట్ ఇచ్చి పిలుస్తాను అన్నారు. అడ్వాన్స్డ్ హ్యాపీ బర్తడే చెప్పారు. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. శివాజీ రాజా అన్నగారిని పిలవగానే మా కార్యక్రమానికి వచ్చారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. అలాగే మా ప్రసన్నగారు నన్ను సొంతమనిషిలా చూసుకుంటారు. రామసత్యనారాయణ గారు ఎప్పుడూ సపోర్ట్ చేసేందుకు రెడీగా ఉంటారు. ప్రభు గారు అన్ని విషయాల్లో సహాకారం మరవ లేనిది. మా మీడియా మిత్రులు చాలామంది ఈ ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది. వైల్డ్ బ్రీత్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటోంది. హరినాథ్ పులి దర్శకుడిగా ఈ చిత్రంతో తానేంటో నిరూపించుకుటాడు అన్నారు.

దర్శకుడు హరినాథ్ పులి మాట్లాడుతూ - నాకు ఈ వైల్డ్ బ్రీత్ సినిమా డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చి సపోర్ట్ చేస్తున్న మా ప్రొడ్యూసర్స్ డా.మురళీ చంద్ గింజుపల్లి, పర్వతనేని రాంబాబు గారికి థ్యాంక్స్. ఈ రోజు పర్వతనేని రాంబాబు గారి  బర్త్ డే. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వైల్డ్ బ్రీత్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. షూటింగ్ తుది దశలో ఉంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం. అన్నారు.

ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు శివ మల్లాల, నారాయణరాజు, హేమసుందర్, కేశవ, శక్తిమాన్, రాధాకృష్ణ, మూర్తి మల్లాల తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి పర్వతనేని రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

టెక్నికల్ టీమ్

బ్యానర్ - సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్

నిర్మాతలు - డా.మురళీ చంద్ గింజుపల్లి, పర్వతనేని రాంబాబు

రచన, దర్శకత్వం - హరినాథ్ పులి

డీవోపీ - రేవంత్ సాగర్

మ్యూజిక్ - వైశాక్ మురళీధరన్

ఎడిటింగ్ - శ్రీహరి సురేష్

ఆర్ట్ - మల్టీ వినోద్ రావెల

ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ - సూర్యతేజ సి. గాజుల

WIld Breath Logo Launch:

WIld Breath Movie Title Launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs