Advertisement
Google Ads BL

అఫీషియల్: AA 22 లో దీపికా పదుకొనె


ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంతోషంలో మునిగిపోయే బ్లాక్ బస్టర్ ప్రకటన వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో దిగ్గజ సంస్థ కళానిధి మారన్‌కు చెందిన సన్ పిక్చర్స్ కాంబోలో పాన్ ఇండియా భారీ ఎంటర్‌టైనర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అనౌన్స్‌మెంట్ నుంచే సినిమాపై ఆకాశాన్నంటేలా అంచనాలు ఏర్పడ్డాయి. దీన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లేలా బాలీవుడ్ గ్లామరస్ క్వీన్ దీపికా పదుకొనె కూడా ఈ టీమ్‌తో జాయిన్ కావటం విశేషం. పాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ బడ్జెట్ విజువల్ వండర్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అద్భుతమైన తారాగణంతో ప్రభంజనం సృష్టించబోతోంది.

Advertisement
CJ Advs

ఈ భారీ కాంబోను తెలియజేసేలా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో అభిమానులను, ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. డైరెక్టర్ అట్లీతో దీపికా పదుకొనె మాట్లాడే సన్నివేశాలతో ప్రారంభమైన ఈ వీడియో ఆమె శక్తివంతమైన పాత్రలోకి మారుతున్న విధానాన్ని చూపించిన తీరు అందరిలో ఉత్కంఠతను రేపుతోంది. హెడ్‌గేర్‌ను ధరించి ఆమె ఫుల్ కాస్ట్యూమ్స్‌తో సెట్లోకి అడుగు పెడుతూ యుద్ధానికి సిద్ధమైంది. మరోసారి క్వీన్ విజయం సాధించనుందనేది దీంతో స్పష్టమవుతోంది.

ఈ చిత్రం కోసం ఇండియన్ సినీ ఇండస్ట్రీని శాసించే నాలుగు శక్తులు ఒక చోటకు చేరుతున్నాయి. వారెవరో కాదు.. ఒకరేమో పుష్ప చిత్రంతో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న అల్లు అర్జున్, జవాన్, తెరి, బిగిల్, మెర్సల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన సెనసేషనల్ డైరెక్టర్ అట్లీ, ఇండియన్ మీడియాలో ఎంతో శక్తివంతమైన సన్ నెట్ వర్క్‌తో పాటు ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో పవర్‌ఫుల్, వెర్సటైల్ స్టార్స్‌లో ఒకరైన దీపికా పదుకొనె కథానాయికగా జాయిన్ కావటం అనేది సినిమా స్కేల్, ప్రతిష్ట మరో ఎత్తుకు చేరుకుంది.

ప్రస్తుతానికి ప్రాజెక్ట్ AA22 x A6 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలవనుంది. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, రొమాలు నిక్కబొడిచే యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్, మన సంస్కృతికి అద్ధం పట్టే కథ, గ్లోబల్ లుక్‌తో ప్రేక్షకులను మెప్పించేలా ఉండనుంది. ఈ సంవత్సరం చివరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మాట్లాడుతూ ‘‘జవాన్ సినిమాలో దీపిక మేడమ్‌తో కలిసి పని చేశాను.అదొక అద్భుతమైన అనుభవం. ఆమె నటనకు సంబంధించిన పరిధి, శక్తి, ప్రతి ఫ్రేమ్‌లో ఆమె అందరినీ తనవైపు తిప్పుకునేలా చేసిన గ్రేస్ గొప్పగా ఉంటాయి. ఆ సినిమాలో ఆమె పాత్ర ఎంత కీలకంగా ఉండి ముందుకు నడిపించిందో మనకు తెలుసు. ఇప్పుడు అల్లు అర్జున్ గారితో పాటు దీపికా పదుకొనెగారు కలిసి సినిమా చేయటం అనేది దర్శకుడి కల నేరవేరినట్టయ్యింది. మరచిపోలేని ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ ఇందులో సృష్టించబోతున్నాం’’ అన్నారు.

సన్ పిక్చర్స్ స్పందిస్తూ ‘‘దీపికా పదుకొనె మా ప్రాజెక్ట్‌లో జాయిన్ కావటం అనేది ప్రాజెక్ట్‌ని మరో రేంజ్‌కి తీసుకెళ్లింది. ఆమె స్టార్ పవర్, భరోసా, ఎవరూ సాటిరాని విధంగా ఉండే ఆమె స్క్రీన్ ప్రెజన్స్ ఈ సినిమాపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందనటంలో సందేహం లేదు. అల్లు అర్జున్ తిరుగులేని ఎనర్జీ, అట్లీ విజన్,  దీపిక బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌లతో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఐకానికి సినిమాను రూపొందించబోతున్నాం’’ అన్నారు.

అల్లు అర్జున్‌తో దీపికా పదుకొనె జోడీ కడుతుండటం, అట్లీ డైరెక్షన్, సన్ పిక్చర్స్ గ్రాండ్ విజన్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ఉన్న హద్దులను చెరిపేసి, సిల్వర్ స్క్రీన్‌పై మరచిపోలేని సరికొత్త శక్తితో, అందరి హృదయాల్లో నిలిచిపోయే లెగసీని క్రియేట్ చేయటానికి సిద్ధమైంది.

Deepika Padukone Joins AA22:

Deepika Padukone Joins Allu Arjun, Atlee, and Sun Pictures for the Biggest Visual Spectacle of Indian Cinema – The Queen Conquers Yet Again
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs