Advertisement
Google Ads BL

అందులో నన్ను కలపకండి - అల్లు అరవింద్‌


నిన్న పవన్ కళ్యాణ్ పేషీ నుంచి వెలువడిన ప్రకటనపై టాలీవుడ్ లో పెద్ద చర్చే మొదలైంది. హరి హర వీరమల్లు ను ఆపేందుకు ఆ నలుగురు కుట్ర చేస్తున్నారంటూ ఏపీ మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యల అనంతరం డిప్యూటీ సీఎం పవన్ పేషి నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ప్రభుత్వాన్నికలవడానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ రాలేందంటూ సినీప్రముఖులకు లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ వచ్చిన లేఖ కి రియాక్ట్ అవుతూ నేడు నిర్మాత అల్లు అరవింద్‌ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్బంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ  రెండు రోజులుగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల గురించి మీకు అవగాహన ఉంది. వాటిలో కొన్ని విషయాల గురించి మాట్లాడటానికి ఈ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశాను. రెండు రోజుల నుంచి మీడియాలో ఆనలుగురు అనే ఓ ప్రచారం ఉంది. ఆ నలుగురికి నాకు సంబంధం లేదు. నేను ఆ నలుగురిలో లేను. గత పదిహేను సంవత్సరాల క్రితం ఆ నలుగురు అనే సంబోదన స్టార్ట్‌ అయ్యింది. ఆ నలుగురు ఆ తరువాత ఆ పది మంది అయ్యింది. అది ఎవరూ పట్టించుకోవడం లేదు.పదిమంది దగ్గర ప్రస్తుతం థియేటర్‌లు ఉన్నాయి. ఆ నలుగురు వ్యాపారం నుంచి కోవిడ్‌ సమయంలోనే బయటికి వచ్చేశాను. 

తెలంగాణలో నాకు ఒక థియేటర్‌ కూడా లేదు. ఏఏఏ ఏషియన్‌ థియేటర్‌ మాత్రమే వుంది. ఆంధ్రాలో కూడా అన్ని థియేటర్స్‌ ఎప్పుడో వదిలేశాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పదిహేను వందలు థియేటర్స్‌ ఉంటే మా దగ్గర కేవలం పదిహేను మాత్రమే ఉన్నాయి. ఈ థియేటర్‌లు కూడా లీజు రెన్యూవల్‌ గడువు ముగిసిన తరువాత లీజు కంటిన్యూ చేయడం లేదు. పాత అలవాటు ప్రకారం ఆ నలుగురిలో నా ఫోటోను వాడుకుంటున్నారు. నన్ను విమర్శిస్తున్నారు. 

దయచేసి మీడియా మిత్రులు ఆ నలుగురు న్యూస్‌లో నన్ను కలపకండి. నేను వాళ్లలో లేను, వారితో వ్యాపారంలో లేను. పదిహేను లోపే నాదగ్గర థియేటర్స్‌ మాత్రమే ఉన్నాయి. జూన్‌1 నుంచి థియేటర్స్‌ మూసివేస్తాం అనే అంశంపై సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ రియాక్ట అయిన విధానం చాలా సమంజసంగా ఉందని నాకు అనిపించింది. నేను ఈ థియేటర్స్‌ అంశానికి సంబంధించిన ఏ మీటింగ్‌లో పాల్గొనలేదు. నేను కావాలని, ఇష్టం లేక వెళ్లలేదు. నా గీతా డిస్ట్రిబ్యూషన్‌ సంబంధించిన వ్యక్తులు కానీ, నాతో అసోసియేట్‌ అయిన మనుషులు కానీ ఈ మీటింగ్‌కు వెళ్లొద్దని చెప్పాను. 

థియేటర్స్‌కు చాలా కష్టాలు ఉన్నప్పుడు ఇండస్గ్రీపెద్దలతో మాట్లాడి. సమస్యలు, సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కొందరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం పట్ల నాకు చిరాకు కలిగి వెళ్లలేదు. థియేటర్స్‌ మూసివేస్తున్నాం అనడం కరెక్ట్‌ కాదు. పవన్‌ కల్యాణ్‌ గారి సినిమా విడుదల సమయంలో థియేటర్స్‌  మూసి వేస్తామని చెప్పడం దుస్సాహసం. మన ఇండస్ట్రీ నుండి ఎవరూ వెళ్లిన కాదనకుండా హెల్ప్‌ చేస్తున్న మంచి మనస్సున వ్యక్తి పవన్‌ కళ్యాన్‌ గారు. గతంలో అశ్వనీ దత్‌ గారి సినిమా విషయంలో పవన్‌ కల్యాణ్‌ గారిని కలిశాం. అప్పుడు ఆయన ఫిల్మ్‌ ఛాంబర్‌ తరపున వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవండి అని హింట్‌ ఇచ్చారు. 

అయితే అప్పుడు ఎందుకో మన వాళ్లు పట్టించుకోలేదు. ఆ విషయాన్ని విస్మరించారు. అఫీషియల్‌గా అందరం కలిసి రావాలి. కానీ కలవలేదు. పవన్‌ కల్యాణ్‌ గారు హింట్‌ ఇచ్చినా కలవలేదు. ఎవరో ఇటీవల మనది ప్రభుత్వానికి సంబంధం లేని రంగం అని అంటుంటే విన్నాను. ప్రభుత్వానికి సంబంధం లేని పరిశ్రమ అయితే గత చీఫ్‌ మినిస్టర్‌ను సినీ పరిశ్రమలోని పెద్ద పెద్ద వాళ్లంతా వెళ్లి ఎందుకు కలిశారు? ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. 

ఇప్పుడు ప్రభుత్వంను వెళ్లి కలవకపోవడం సరికాదు. మనకు కష్టం వస్తే తప్ప మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్లమా? ఏపీ మంత్రి దగ్గర నుంచి వచ్చిన నోట్ ఎంతో సమర్థనీయంగా ఉంది. నిజంగానే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకు సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి తప్ప ఇలా థియేటర్స్ మూసి వేస్తున్నామని చెప్పడం సరికాదు అన్నారు.

Allu Aravind Press Meet :

Allu Aravind Press Meet on Theatres Bandh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs