Advertisement
Google Ads BL

కుబేర టీజర్ - మాటల్లేవ్ మాట్లాడుకోవటాల్లేవ్


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధనుష్-నాగార్జున హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా కుబేర సెకండ్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రాన్స్ ఆఫ్ కుబేర పేరుతో ఉన్న ఈ వీడియోలో ఎక్కడా డైలాగ్స్ వినిపించవు, కానీ పాటతోనే ప్రేక్షకులను కుబేర డార్క్ అండ్ హిప్నోటిక్ వరల్డ్ లోకి తీసుకెలుతోంది. సినిమాలోని కీలక పాత్రలను, వారు క్రియేట్ చేయబోయే తుఫానును అద్భుతంగా ప్రజెంట్ చేసింది.

Advertisement
CJ Advs

ఈ ఎక్సయిటింగ్ టీజర్‌లో డీఎస్‌పీ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. నాది నాది నాది నాదే ఈ లోకమంతా అనే హిప్నాటిక్ కోరస్ అదిరిపోయింది. నంద కిషోర్ రచించిన ఈ పాటను ధనుష్, హేమచంద్ర వేదాల కలిసి తన డైనమిక్ వోకల్స్ తో అదరగొట్టారు.

నాగార్జున ఫవర్ ఫుల్ అండ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ఆయన పాత్ర బలమైనది, భావోద్వేగంతో కూడినది, విలువలతో నడుచుకునే వ్యక్తిలా కనిపించినా అంతర్గతంగా ఎన్నో ప్రశ్నలతో ఉన్నట్టుగా ఉంది. ఆయన పాత్రను మంచో చెడో అనలేని విధంగా రూపొందించటం సినిమా పట్ల ఎక్సయిట్మెంట్ మరింతగా పెంచుతుంది.

ఈ టీజర్‌లో రష్మిక మందన్న, జిమ్ సర్భ్ ల పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి. ప్రతి పాత్ర మిస్టీరియస్, డేంజరస్ గేమ్ లో భాగమైనట్లుగా కనిపిస్తోంది. ట్రాన్స్ ఆఫ్ కుబేర రెగ్యులర్ టీజర్లకు భిన్నంగా, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా రూపొందించబడం మేకర్స్ బోల్డ్ నిర్ణయాన్ని ప్రజెంట్ చేస్తోంది.

నాగార్జున, ధనుష్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, శేఖర్ కమ్ముల విజనరీ నెరేటివ్, డీఎస్‌పీ అందించిన మెస్మరైజింగ్ మ్యూజిక్.. ఇవన్నీ కలిసిన ఈ పాన్ ఇండియన్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా జానర్‌ ని రిడిఫైన్ చేసేలా వున్నాయి.

Kuberaa Teaser Reeleased:

Kuberaa Teaser review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs