జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ నేతలను లిక్కర్ స్కామ్ లో ఇరికించిన విజయ్ సాయి రెడ్డి అంటే అంతెత్తున లేస్తున్నారు. విజయ్ సాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుని ఆయన పనిలో ఆయనఉన్నారు. ఎక్కడ కేసులు మెడకు చుట్టుకుంటాయో అని ఆయన సైలెంట్ అయ్యారు. అయినప్పటికీ పలు కేసు ల్లో విజయ్ సాయి రెడ్డి విచారణకు హాజరవ్వడంతో సాయి రెడ్డి నిజాయితీగా అందులో ఫ్రాడ్ చేసిన వారి పేర్లు బయటపెడుతున్నారు.
ఆ అక్కసుతో జగన్ పదే పదే విజయ్ సాయి రెడ్డి ని చంద్రబాబు ప్రలోభాలకు విజయ్ సాయి లొంగిపోయాడు, చంద్రబాబు కి కూటమి ప్రభుత్వానికి మేలు చేసేందుకే రాజ్యసభ ఎంపీ పదవిని వదులుకున్నాడు, సాయి రెడ్డి అలా, సాయి రెడ్డి ఇలా అంటూ జగన్ ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. మరి విజయ్ సాయి రెడ్డిని కెలికితే జగన్ కే నష్టమనే మాట వైసీపీ సర్కిల్స్ నుంచే వినబడుతుంది.
జగన్ ముందు నుంచి విజయ్ సాయి రెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు, వైసీపీ పార్టీలో లోటుపాట్లు, లొసుగులు, నేతల అక్రమ దందా లు అన్ని విజయ్ సాయి రెడ్డికి తెలుసు, కొన్నాళ్ళుగా సాయి రెడ్డిని జగన్ పట్టించుకోకుండా సజ్జల, ధనుంజయ్ రెడ్డి లాంటి వాళ్లు చేసారు. కనకే విజయ్ సాయి రెడ్డికి మండి.. పార్టీని వదిలేసాడు.
ఇలాగే జగన్ కెలుకుతూ పొతే విజయ్ సాయి రెడ్డి ఎంత దూరమైనా వెళ్తాడు, జగన్ ను కూడా ఇరికించేందుకు సాయి రెడ్డి వెనక్కి తగ్గడు. ఇకపై సాయి రెడ్డి జోలికొస్తే ఇంకెంతమంది వైసీపీ నేతలు జైలు పాలవుతారో చూసుకో జగన్ అంటూ వైసీపీ నుంచే జగన్ ను హెచ్చరిస్తున్నారట.