స్వాగ్ డిజాస్టర్ తర్వాత హీరో శ్రీవిష్ణు కామెడీ జోనర్ లో చేసిన సింగిల్ థియేటర్స్ లో సూపర్ హిట్ అయ్యింది. కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవడంతో సమ్మర్ లో పిల్లలతో కలిసి ఫ్యామిలీస్ థియేటర్స్ కి కదలడంతో ఈ నవ్వుల డ్రామాకి భారీ లాభాలొచ్చాయి. శ్రీవిష్ణు-వెన్నెల కిషోర్ ట్రాక్ బాగా వర్కౌట్ అవడంతో సింగిల్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేసారు.
సింగిల్ చిత్రం మే 9 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సమంత శుభంతో పోటీ పడింది. సమంత శుభం కి ఓ వర్గం ఆడియన్స్ కనెక్ట్ అయినా ఎక్కువగా సింగిల్ కి ఓటేశారు ఆడియన్స్. సింపుల్ గా శ్రీవిష్ణు సింగిల్ తో హిట్ కొట్టెయ్యడంతో ఇప్పుడు ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోస్ట్రీమింగ్ అవుతుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సింగిల్ ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకోగా.. ఈ చిత్రాన్ని జూన్ 6నుంచి అంటే సింగిల్ థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల్లోపు ఓటీటీలో స్ట్రీమింగ్ కి తెచ్చెందుకు రెడీ అవుతుంది అనే న్యూస్ ఫ్యామిలీ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేసింది.