మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ జూన్ నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది. ఇది కంప్లీట్ రీలోడెడ్, రీ ఇమాజిన్డ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి కమర్షియల్ మాస్ అవతార్ లో అలరించబోతున్నారు. ఇది అభిమానులకే కాదు, యావత్ ప్రేక్షకులకు హై-ఓక్టేన్ కథనంతో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.
ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆశుతోష్ రానా, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నాగ మహేశ్, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.