రాజమౌళి దర్శత్వంలో సూపర్ స్టార్ నటిస్తున్న SSMB 29 షూటింగ్ కి లాంగ్ బ్రేకిచ్చారు, టీమ్ అంతటికి వేసవి సెలవులిచ్చారు, మళ్లీ మహేష్ ఫ్యామిలీ వెకేషన్ కి చెక్కేస్తారని అన్నారు. కానీ రాజమౌళి, మహేష్ నుంచి ఎలాంటి అలికిడి లేదు. SSMB 29 మొదలు పెట్టడమే చాలా సీక్రెట్ గా సైలెంట్ గా మొదలు పెట్టారు.
ఎంత సీక్రెట్ మైంటైన్ చేసినా ఒడిశా షెడ్యూల్ లో మహేష్ సీన్స్ లీకై సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, అలాగే బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు. కానీ ఎక్కడా అధికారిక ప్రకటన లేదు, అన్ని అనధికార వార్తలే. కానీ వారు SSMB 29 లో ఉన్నారు అనేది ఫిక్స్.
రాజమౌళి అసలు SSMB 29పై ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు. ఎప్పుడు SSMB 29 పై క్లారిటీ ఇస్తారని మహేష్ అభిమానులతో పాటుగా యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. మే 30 కృష్ణగారి జయంతికి ఏమైనా అప్ డేట్ వదులుతారా, లేదంటే మహేష్ బర్త్ డే ఆగష్టు 9 వరకు వెయిట్ చేయిస్తారా అనే విషయంలో అభిమానులు తెగ ఇదైపోతున్నారు. మరి రాజమౌళి ఈ సస్పెన్స్ కి తెర ఎప్పుడు దించుతారో చూడాలి.