జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ స్థావరాల్లో ఉగ్రవాదులకు సమాధి కట్టేశారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో అన్యాయంగా ప్రజలను కాల్చి చంపింది పాక్ ఉగ్రమూక. అప్పటినుంచి ఇండియా మొత్తం పగతో రగిలిపోతుంది. పాకిస్తాన్ అంతుచూడమంటూ ప్రధాని మోడీ ని వేడుకుంటుంది. ప్రధాని మోడీ ఏ డెసిషన్ తీసుకుంటారా అని యావత్ ప్రపంచం ఎదురు చూసింది. ఇండియా ఏం జరగాలనుకుందో అది చేసి చూపింది భారత సైన్యం.
ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఉగ్రవాద స్థావరాలపై భరత్ సైన్యం విరుచుకుపడింది. చెప్పి మరీ ఎటాక్ చేసింది భారత సైన్యం. దాడులకు కొద్ది నిమిషాల ముందే ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది. అర్ధరాత్రి ఒంటిగంట 28 నిమిషాలకు దాడికి సిద్ధం.. గెలుపే లక్ష్యం అంటూ ఆర్మీ ట్వీట్ చేసింది. ఒంటి గంట 51 నిమిసాలకు ఆపరేషన్ ముగిసాక న్యాయం జరిగింది.. జై హింద్ అంటూ ఆర్మీ మరో ట్వీట్ చేసింది.
ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియన్ ఆర్మీ లష్కరే తోహిభ ఉగ్ర నాయకుడు హఫీజ్ అబ్దుల్లా మాలిక్ హతమార్చింది. ఈ ఆపరేషన్ సింధూర్‌ని స్వయంగా పర్యవేక్షించారు ప్రధాని మోదీ. వార్‌రూమ్ నుంచి లైవ్‌లో వీక్షించారు. అంతేకాదు ఆపరేషన్ సింధూర్‌పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష చేశారు. ఉగ్ర స్థావరాలు నేలమట్టం కాగానే జైహింద్ అంటూ రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆపరేషన్ సింధూర్‌పై అమిత్‌షా స్పందించారు. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనే ఆపరేషన్ సింధూర్ అంటూ కేంద్ర హోంమంత్రి పోస్ట్ చేశారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని హెచ్చరించారు అమిత్‌షా.