Advertisement
Google Ads BL

సడన్ గా రేస్ లోకి CM పెళ్లాం..


ప్రముఖ నటుడు అజయ్, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం CM పెళ్లాం.రమణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బీఆర్‌కే నిర్మించారు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సినిమా ప్రెస్‌మీట్‌ను నేడు చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే.. సీఎం అవుతాడు. ఎలక్షన్లు రాగానే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే వ్యక్తే కాకుండా ఆయన సతీమణి ఓట్లు అడగడం తెలిసిందే. కానీ గెలిచాక ఎంతమంది తమ ఇంటికి వచ్చిన ఓటర్లను కలుస్తున్నారు? సినిమా ద్వారా ఈ ప్రశ్నను నేను అడుగుతున్నా. కనీసం ఈ సినిమా తర్వాత అయినా అది ప్రారంభమవుతుందని నేను ఆశిస్తున్నా. ఎమ్మెల్యే కాస్త బిజీగా ఉండి బయట తిరుగుతున్న సమయంలో ఇంటికి పెద్ద సంఖ్యలో తమ సమస్యల పరిష్కారానికి వచ్చిన వ్యక్తులను ఎమ్మెల్యే పెళ్లాం ఒక రెండు లేదంటే మూడు గంటల పాటు కలిస్తే చాలా మార్పులొస్తాయని నమ్మాను. ఏదో చేయాల్సిన అవసరం లేదు కానీ కలిస్తే చాలు మార్పొస్తుందని ఈ సినిమాలో చూపించా. ఇక యంగ్‌స్టర్స్ గురించి కూడా ఈ సినిమాలో చూపించాను. గత ప్రెస్‌మీట్‌లో నేను పాటలో ‘హైడ్రాబాడ్ సిటీ’ అన్నానని కాంట్రవర్శీ చేశారు. నేను అన్నది హైదరాబాద్ బ్యాడ్ అని కాదు. సీఎం రేవంత్ రెడ్డి ‘హైడ్రా’అనేది బయట పెట్టారు.  అది సక్సెస్ అయితే వర్షాలొచ్చినప్పుడు సిటీ మునిగిపోకుండా ఉంటుంది. మొన్న వైరస్ టైంలో మాస్క్ చూశాం. ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో వైరస్ వ్యాధి కన్నా మించింది బుూతు. మీడియా ముందుకు వచ్చి రాజకీయ నాయకులు బుూతులు మాట్లాడకూడదన్న పాయింట్‌ను ఈ సినిమా ద్వారా బయటపెడుతున్నా. గవర్నమెంట్ జీవోలను ఆపిన హైకోర్టు. ఈ క్రమంలోనే హైకోర్టుకు, గవర్నర్‌కు ఒక వినతి పత్రం అందించబోతున్నా. రాజకీయ నాయకులు మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడితే రాజకీయాల్లో పోటీ ఐదేళ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం విధించాలనే రూల్ తీసుకురావాలని కోరబోతున్నా. అలాగే పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే.. పవర్ కోల్పోతారన్న రూల్ రావాలి. కాబట్టి ఇది రొటీన్ సినిమా కాదు. ఎంటర్‌టైన్‌‌మెంట్ యాంగిల్‌లో ఒక మెసేజ్ ఇవ్వబోతున్నా అన్నారు.

Advertisement
CJ Advs

అజయ్ మాట్లాడుతూ.. రమణారెడ్డి గారు యూఎస్ వెళ్లి 25 ఏళ్లవుతుంది. ఇంతకాలం తర్వాత ఒక బౌండ్ స్క్రిప్ట్‌తో నా దగ్గరకు వచ్చారు. ఈ మధ్య కాలంలో బౌండ్ స్క్రిప్ట్స్ పెద్దగా రావడం లేదు. నేను కన్విన్స్ అయింది ఏంటంటే.. ప్రి వర్క్ కానీ.. పోస్ట్ వర్క్ కానీ మొత్తం బౌండ్ స్క్రిప్ట్‌తో వచ్చారు.  సినిమా చేయవచ్చనడానికి ఫస్ట్ గ్రీన్ ఫ్లాగ్ నాకు. కంటెంట్ ఉమన్ ఎంపవర్‌మెంట్ మీద ఉంది. పొలిటికల్‌గా ఏమేం మార్పులు చేస్తే బాగుంటుందనే దానిపై ఆయన సినిమా చేస్తున్నారు. కాబట్టి అదంతా నచ్చి సినిమా చేశారు. ఇక ప్రొడ్యూసర్ రామకృష్ణ గారు ఎంత అవసరమో అంత స్పెండ్ చేశారు. ఇంద్రజ గారితో ‘దిక్కులు చూడకు రామయ్య’ తర్వాత కలిసి పని చేయడం జరిగింది. జయసుధ గారు, సుమన్ గారు, శ్రీనివాస్ గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో భాగమవడం చాలా ఆనందంగా ఉంది. మే 9న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. మంచి సినిమా, మెసేజ్ ఉన్న సినిమా తప్పక ఈ సినిమాను అందరూ చూడండి అన్నారు.

ప్రొడ్యూసర్ రామకృష్ణ మాట్లాడుతూ.. పొలిటికల్‌తో పాటు ఈ రోజు జరుగుతున్న ఎలక్షన్ల గురించి .. ఇప్పుడు జరుగుతున్న ఓట్ల గురించి.. ప్రజలకు జరుగుతున్న న్యాయం గురించి.. సహాయం గురించి మాకన్నా మీకు ఎక్కువగా తెలుసు. రమణారెడ్డి గారిని కలిసిన తర్వాత బౌండెడ్ స్క్రిప్ట్ ప్రతి దానిని నీట్‌గా రెడీ చేసి పొలిటికల్ లీడర్స్, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి ప్రజలకు సేవ చేస్తే ఎలా ఉంటుంది? రాష్ట్రం ఏ విధంగా బాగు పడుతుంది? అనేది కొంత మేర అనుభవం ఉంది. ప్రస్తుతం నేను రాజకీయాల్లో లేను కానీ మా మదర్ మా గ్రామ సర్పంచ్‌గా ఉంది. బూతులు మాట్లాడితేనే గొప్ప అనుకునే రాజకీయ నాయకుల నుంచి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో సినిమా చేయడం జరిగింది. రమణారెడ్డి గారు, అజయ్ గారు, ఇంద్రజ గారు చాలా కష్టపడి పని చేశారు. ఈ సినిమా చూశాక ప్రజల్లో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నా అన్నారు.

నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. రమణారెడ్డి గారు ఒక ఎరా చూసి  మధ్యలో గ్యాప్ తీసుకుని మళ్లీ తను స్టేబుల్ అయ్యాక హైదరాబాద్‌కు తిరిగొచ్చి సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశారు. అన్ని క్రాఫ్ట్స్‌లోనూ ఆయనకు అనుభవం ఉంది. ఈ సినిమా ద్వారా ఒక్కొక్క ఫ్రేమ్ ఒక మెసేజ్. ఈ సినిమా చూస్తుంటే ప్రతిదీ కరెక్టే అనిపిస్తుంది. యంగర్ జనరేషన్, కుటుంబ వ్యవస్థ, సీఎం భార్య బయటకు వస్తే ప్రజలకు ఎలా సేవ చేయగలుగుతారు? అనేది మా సినిమా. అజయ్ గారు, ఇంద్రజ గారు పెద్ద అసెట్ సినిమాకు. క్యాస్టింగ్ కూడా చాలా జాగ్రత్తగా సెలక్ట్ చేసి తీసుకున్నారు. తెలుగులో చాలా గొప్ప నటులున్నారు. కచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ మొదటి స్థానంలో ఉంది. కానీ చిన్న చిన్న క్యారెక్టర్స్‌ని కూడా కొందరు ఇంపోర్ట్ చేసుకోవడం దారుణం. కాబట్టి ప్రతి ఒక్కరూ లోకల్ నటులను ఎంకరేజ్ చేయండి. ఈ సినిమాలో చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాకు పెట్టుబడి పెట్టేందుకు బీఆర్కే గారు ముందుకు రావడం చాలా సంతోషం’ అని తెలిపారు.

CM Pellam release on May 9th:

CM Pellam to be released on May 9th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs