Advertisement
Google Ads BL

క్రేజీ టైటిల్ తో రాబోతున్న శర్వానంద్


చార్మింగ్ స్టార్ శర్వా - సంపత్ నంది కలయికలో ప్రాజెక్ట్ #శర్వా38 రూపుదిద్దుకుంటుంది. 1960 బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ స్పార్క్ అనే పవర్ ఫుల్ కాన్సెప్ట్ వీడియో ద్వారా రివిల్ చేశారు.

Advertisement
CJ Advs

దర్శకుడు సంపత్ నంది విధి, పోరాటం, మార్పు అనే కథను నరేట్ చేస్తుండగా ఈ వీడియో సినిమా ఎసెన్స్ చూపిస్తుంది. శర్వా ఆ కథను ఆసక్తిగా వింటూ, ధైర్యం, యుద్ధాలతో నిండిన ఒక ప్రపంచాన్ని ఊహించుకుంటాడు. కీలక ఘట్టంగా ఒక ఖడ్గం ప్రయాణం మొదలవుతుంది. అలా భోగి టైటిల్ రివిల్ అవుతుంది. ఈ టైటిల్ కొత్త శక్తి, తిరుగుబాటును ప్రజెంట్ చేస్తోంది. వీడియోలో ప్రజెంట్ చేసినట్లుగా శర్వా నెవర్ బిఫోర్ పాత్రలోకి అడుగుపెడుతున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్‌లో గ్రాండ్ స్కేల్ లో ప్రారంభమైయింది. వీటిలో కొన్ని భాగాలను కాన్సెప్ట్ వీడియోలో ప్రజెంట్ చేశారు. ఈ చిత్రంలో శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Sharwa 38 Is Bhogi:

Sharwanand and Sampath Nandi Pan-India Spectacle Titled As Bhogi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs