బాలీవుడ్ బ్యూటీ ట్రిప్తి దిమ్రీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. యానిమల్, గుడ్ న్యూజ్ లాంటి బోల్డ్ హిట్ చిత్రాలతో ఈ భామ రేంజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తున్న ధడక్ 2లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే మాధురి ధీక్షిత్ తో కలిసి `మా బెహన్` అనే చిత్రంలో నటిస్తోంది. విశాల్ భరద్వాజ్ లాంటి సీనియర్ దర్శకుడితో కలిసి అర్జున్ ఉస్తారా అనే చిత్రంలో నటించనుంది. షాహిద్ కపూర్ ఈ చిత్రంలో కథానాయకుడు.
మరోవైపు ట్రిప్తి ఇన్ స్టాలో వరుస ఫోటోషూట్లతో 60లక్షల మంది ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీటిస్తోంది. తాజాగా బికినీ బీచ్ సెలబ్రేషన్స్ లో తలమునకలుగా ఉన్న ఈ బ్యూటీ కొన్ని స్పెషల్ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. వైట్ బికినీ టాప్.. పొట్టి స్కర్ట్ లో అందాలను ప్రదర్శిస్తున్న ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ట్రిప్తి, రిలాక్స్ అయ్యేందుకు ఈ ట్రిప్ ప్లాన్ చేసిందట. అయితే ఇది బాలీనా? ఇంకేదైనా ఎగ్జోటిక్ బీచ్ వెకేషనా అన్నది తెలియాల్సి ఉంది.
అంతేకాదు.. బికినీ బీచ్ లో ట్రిప్తీ ఒంటరిగానే ఉందా? లేక తనతో చెలికాడు ఎవరైనా ఉన్నారా? అంటూ నెటిజనులు ఆరాలు తీస్తున్నారు. ఆసక్తికరంగా ఇదే స్పాట్ నుంచి ట్రిప్తి బోయ్ ఫ్రెండ్ సామ్ మర్చంట్ కూడా సూర్యాస్తమయానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసాడు. ట్రిప్తీ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలతో ఇవి పోలి ఉన్నాయి. దీనిని బట్టి బోయ్ ఫ్రెండ్ తో ట్రిప్తి ఒంటరి బీచ్ లో ఎంజాయ్ చేస్తోందని క్లారిటీ వచ్చింది.