Advertisement
Google Ads BL

చంద్ర బాబుకు వార్నింగ్..


చంద్రబాబు బాబు గారు.. ఏంటి మీరు.? ఎప్పుడూ జనాల గురించి ఆలోచించడమే గానీ, మీ ఆరోగ్యం గురించి పట్టించుకోరా.? ఐదు రోజుల నుంచి వరద నీళ్ళలోనే, జనం మధ్యలోనే, ఇంటికి కూడా వెళ్ళకుండా తిరుగుతున్నారు. మీ ఆలోచన ఎప్పుడూ జనం క్షేమం గురించే ఉంటుందిలే గానీ, కాస్త మీ గురించి కూడా కాస్త పట్టించుకోవయ్యా బాబూ! ఏంటీ, మిరేమన్న బాలాకుమారుడు అనుకుంటున్నారా.? మీకు అర్థమవుతోందో లేదోగానీ, మీరు డైమండ్ జూబ్లీ కి వచ్చేశారు బాబు.!

Advertisement
CJ Advs

గతంలో కూడా ఇలాగే పనిచేశాను, ఇప్పుడు కూడా ఇలాగే చేస్తానంటే ఎలాగయ్యా? అప్పట్లో అంటే మీ వయసు 57.. ఇప్పుడేమో 75. మీ వయసు కైనా గౌరవించి కాస్త ఈ రకమైన హార్డ్ వర్క్ తగ్గించండి బాబు.!

మీరీప్పుడు చిన్న పిల్లాడితో సమానం. నిన్ననో, మొన్నో ఓ వీడియోలో చూశా.. మీరెంటి? మీ వయసేంటీ?

పాతిక కిలోల బస్తాని లేపి అవతల పెట్టేశావు. మీ వయసుకి ఇలాంటి పనులు చేయడం కరెక్టా చెప్పండి.? పాతిక కిలోల బస్తాని లేపాలంటే పాతికేళ్ళ వయసున్న కుర్రాళ్ళు కూడా వామ్మో అంటారు..

నువ్వేంటయ్యాబాబు..

చిటుక్కుమని లేపేశావ్.. లటుక్కుమని పక్కన పెట్టేశావ్. అయినా ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం నీకేంటి బాబు.? అసలు మీకు చెప్పడం మా వల్ల కాదు స్వామీ...

ఈ వయసులో మిమల్ని అపురూపంగా చూసుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వేమో సీతయ్యకి తాతయ్యలాగా తయారయ్యావ్. ఎవరి మాటా వినడు చంద్రయ్య అన్నట్టుగా ఇలాంటి హార్డ్ వర్క్ చేస్తున్నావ్..!!

అవునుగానీ, ఈరోజు మీరు బుడమేరుకి గండి పడిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఫంటు ఎక్కావు. అప్పుడు లైఫ్ జాకెట్ వేసుకోవాలని తెలియదా.? దానికితోడు కాలు స్లిప్పయితే వాగులో పడిపోయేలా వున్న ఆ రైల్వే ట్రాక్ పక్క నుంచి వెళ్ళడమేంటి? కరెక్ట్.గా అప్పుడే రైలు రావడమేంటి.?

సమయానికి చూసుకోకపోతే ఏమైపోయేది.? యో.. చూసుకోబళ్ళా? మీ పక్క నుంచి రైలు దూసుకువెళ్తున్న వీడియో చూసి మాకు గుండెలు గుబగుబలాడాయి.

ఫిలమెంటు రాలిపోయినంత పనైంది. రైలు పక్కన వున్న మీరు మాత్రం.. నాకిలాంటివి మామూలే అని సంతూర్ మామ్ లాగా ఎక్స్.ప్రెషన్ ఇచ్చి నిల్చున్నావ్. అంతేలే, అలిపిరిలో క్లైమోర్ మైన్స్ పేల్చినా చాలా లైట్‌గా తీసుకున్న మొండిఘటానివి నువ్వు.

అయినా గండి పడిన చోట సిట్యుయేషన్ ఎలా వుందో అధికారులు చెబుతారు కదా... మీరెందుకు లింగులింగుమంటూ వెళ్ళారు ? నేను వెళ్ళాల్సిందే.. నేను చూడాల్సిందే అంటావ్..

ఇలాంటప్పుడే మిమల్ని చూస్తే కోపం వస్తుంది. ముందు మీరు సేఫ్‌గా వుండాలి. ఆ తర్వాతే మిగతా విషయాలు.!

ఇదిగో బాబు గారు..

మీరు మర్యాదగా మేం చెప్పినట్టు వింటారా..? లేక భువనమ్మకి చెప్పి మిమల్ని కంట్రోల్ చేయించాలా? ఏదో మా పిచ్చిగానీ, మీరు ఆమె మాట కూడా వినేరకం కాదు.

చూడండి చంద్రబాబు గారు...

మీ జీవితం మీరు ఎప్పుడో జీవించేశారు.. ఇప్పుడు మీరు జీవిస్తున్నది మీ జీవితం కాదు.. మా జీవితం! మీ జీవితం ఇప్పుడు మా జీవితం కాబట్టి, మీరు మీ ఇష్టమొచ్చినట్టు వుంటానంటే మేం ఒప్పుకోం.

మన రాష్ట్రం విభజనతో సగం నాశనం అయింది. ఆ దరిద్రుడు జగన్ మిగతా సగాన్ని కూడా నాశనం చేసి సర్వనాశనం చేసిపారేశాడు. ఇప్పుడు మన రాష్ట్రాన్ని కాపాడేది మీరు తప్ప మరెవరూ కాదు.. మాకు మీరు తప్ప మరో దిక్కు లేదు...

అందువల్ల మీరు మీ కోసం కాకపోయినా... మాకోసమైనా రిస్కులు చేయకయ్యా మహానుభావా! నువ్వు ఈ రాష్ట్రాన్ని దారిలో పెట్టాలి. ఆ నీచ, నికృష్టుడైన జగన్ బారి నుంచి మమ్మల్ని కాపాడాలి.

అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా మార్చాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రం కావాలి.. ఇదంతా చేయడానికి... ఇదంతా చూడటానికి..

మీరు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి. మీకు దణ్ణం పెడతాం నాయనా.. మీ వయసుకు మించిన సాహసాలు చేయకు.. మాకు టెన్షన్ తెప్పించకు.

ఎందుకంటే, మీరు మాకు అపూర్వం.. మీరు మాకు అపురూపం.. అంతే..!!!

ఇలా ఓ అభిమాని ఆవేదన వ్యక్తం చేస్తుంన్నాడు..  

Warning to Chandra Babu..:

Netizens warns to Chandrababu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs