Advertisement

స్వయంభూలో నభా నటేష్ లుక్


కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ నటిస్తున్న స్వయంభూ ప్రస్తుతం దేశంలోని క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. లెజెండరీ యోధుడిగా నటిస్తున్న నిఖిల్ పాత్ర కోసం ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న స్వయంభూ నిఖిల్ 20వ చిత్రం. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్ , శ్రీకర్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. స్వయంభూ టాప్-క్లాస్ టెక్నికల్, ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో రూపొందుతోంది.

Advertisement

ఈ చిత్రంలో సంయుక్త ఒక కథానాయికగా నటిస్తోంది. ఆమె తన పాత్ర కోసం శిక్షణ కూడా తీసుకుంది. మేకర్స్ ఈరోజు ఒక పెద్ద అప్‌డేట్‌తో వచ్చారు. చేతికి గాయమైన నభా నటేష్ మళ్లీ వర్క్ లో చేరారు. ఈ మాస్టర్‌పీస్‌లో ఒక మహిళా ప్రధాన పాత్రను పోషించడానికి ఆమె బోర్డులోకి వచ్చారు. మేకర్స్ ఆమె లుక్ ని రివిల్ చేశారు. నభా గాయం నుంచి కోలుకుని టీంలో చేరినట్లు వీడియోలో ప్రజెంట్ చేశారు. ఈ పాత్ర కోసం ఆమె ట్రాన్స్ ఫర్మేషన్ అద్భుతంగా వుంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో, చీరలో నగలతో ఆమె యువరాణిలా కనిపిస్తోంది. నిఖిల్ కూడా వీడియోలో ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఈ చిత్రంలో నభా నటేష్ కీలకమైన, శక్తివంతమైన పాత్రను పోషిస్తోంది. అది పోస్టర్‌లో ఆమె గెటప్, లుక్‌లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్.

Nabha Natesh Comes On Board For Swayambhu:

Nabha Natesh Comes On Board For Nikhil, Bharat Krishnamachari, Pixel Studio Pan India Project Swayambhu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement