Advertisement
Google Ads BL

సుకుమార్ లాంచ్ చేసిన పొక్కిలి పోస్టర్


VRGR మూవీస్ నిర్మాణ సంస్థ ప్రముఖ యాక్టింగ్ గురు మహేష్ గంగిమళ్ల ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం పొక్కిలి. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ మరియు పోస్టర్ లాంచ్ కార్యక్రమం ప్రముఖ దర్శకులు శ్రీ సుకుమార్ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమం లో సుకుమార్ గారు మాట్లాడుతూ.. కొత్తగా ట్రై చేస్తున్న ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తుంది అని దర్శక, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement
CJ Advs

పొక్కిలి క్లైమాక్స్, 2 సాంగ్స్ షూటింగ్ మినహా మొత్తం షూటింగ్ అయిపోయిందని దర్శక నిర్మాతలు తెలిపారు. కెమెరామెన్ జయపాల్ నిమ్మల అద్భుతమైన ఫోటోగ్రఫీ విజువల్స్ తో పాటు మంచి విలువలతో కూడిన స్క్రిప్ట్, దర్శకత్వం మా చిత్రానికి బలం అని నిర్మాత గొంగటి వీరాంజనేయ నాయుడు (G.V. నాయుడు) తెలిపారు.

తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, రియలిస్టిక్ అప్రోచ్ తో వస్తున్న ఈ చిత్రంతో హీరో, హీరోయిన్స్ గా తన దగ్గర నటన నేర్చుకున్న నేత్ర, శ్రేయస్ బట్టోజు, సుదీర్ శర్మ, సాయి రాఘవేంద్ర, ప్రద్యుమ్న ని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నామని దర్శకుడు మహేష్ గంగిమళ్ళ తెలిపారు. కాలికేయ ప్రభాకర్ విభిన్నమైన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఇంకా రమణ చల్కపల్లి, మల్లేష్ బాలాస్ట్, శ్రీలక్ష్మి గోవర్ధన్, తదితరులు నటించారు.

ఈ చిత్రానికి స్టంట్స్: రాజకుమార్ గోల్డ్ ఫిష్, ఎడిటింగ్: వెంకట ప్రభు, ఫోటోగ్రఫీ: జయపాల్ నిమ్మల, నిర్మాత: గొంగటి వీరాంజనేయ నాయుడు (G.V. నాయుడు), స్టోరీ- స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరెక్షన్: మహేష్ గంగిమళ్ళ.

Pokkili movie poster launched by Sukumar:

VRGR Movies Pokkili movie poster launched by Sukumar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs