Prabhas took to social media to share a beautiful picture showing the medals India has won in Birmingham 2022 Commonwealth Games.
in /home/cinejosh/public_html/news_story_telugu_amp.php on line 117
దేశం గర్వించే ప్రతి సందర్భంలో తన శుభాకాంక్షలు తెలిపేందుకు ముందుంటారు పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ డార్లింగ్ ప్రభాస్. దేశానికి పేరు తెచ్చే ప్రతి ఒక్కరి పట్ల ప్రోత్సాహకరంగా స్పందిస్తుంటారు. ప్రస్తుతం ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో దేశం తరుపున పతకాలు సాధించిన క్రీడాకారులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్ స్టాగ్రామ్ లో భారత క్రీడా వీరులు సాధించిన పతకాల పట్టికను పోస్ట్ చేస్తూ తన గ్రీటింగ్స్ తెలిపారు.
కామన్వెల్త్ క్రీడల విజేతలందరికీ కంగ్రాట్స్. మీరు సాధించిన విజయాలతో దేశం గర్విస్తోంది. భారత్ కు మెడల్స్ సాధించడంలో మీరు చూపించిన పట్టుదల, అంకితభావం చాలా గొప్పవి అంటూ థాంక్స్ నోట్ పోస్ట్ చేశారు.