Advertisement

సురాపానం కిక్ అండ్ ఫన్ ట్రైలర్ విడుదల


సంపత్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా సురాపానం. కిక్ అండ్ ఫన్ అనేది ట్యాగ్ లైన్. ప్రగ్యా నయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మట్ట మధు యాదవ్ నిర్మిస్తున్నారు. ఫాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 10 న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అతిథిగా పాల్గొన్నారు.

Advertisement

ముఖ్య అతిథి మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. మనిషికే కాదు దేవుళ్లకు కూడా ఉత్సాహాన్ని ఇచ్చేది సురాపానం అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనే ఊహతో తెరకెక్కించిన సినిమా ఇది. ట్యాగ్ లైన్ పెట్టినట్లే కిక్ అండ్ ఫన్ ఇస్తుంది. వినోదం, ఆశ్చర్యం, ఆసక్తి కలిగించే కథా నేపథ్యంతో మంచి ప్రేమ కథను కూడా చూపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ ప్రాంత నేపథ్యంతో మంచి సినిమాలు తెరకెక్కుతున్నాయి. కంటెంట్ తో వస్తున్న సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. అలాంటి చిత్రమే సురాపానం. కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రాల్లో ఏ అంశాలు ఉంటాయో ఈ సినిమాలోనూ అవన్నీ ఉంటాయి. సంపత్ కుమార్ హీరోగా నటిస్తూనే ఒక మంచి కథను అల్లి సినిమాను తెరకెక్కించాడు. సినిమాల మేకింగ్ లో యువ ప్రతిభావంతులను ప్రభుత్వం తరుపున ప్రోత్సహిస్తున్నాం. తెలంగాణ నేపథ్యంతో సినిమాలు చేయమని చెబుతున్నాం. గత ఏడేళ్లుగా మాతో ప్రయాణిస్తున్నాడు సంపత్ కుమార్. ఈ యంగ్ టాలెంట్ నిలబడితే మరికొంత మందికి స్ఫూర్తి కలుగుతుంది. సురాపానం సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.

హీరో, దర్శకుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ.. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ప్రోత్సహించిన మా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. వాళ్ల ప్రోత్సాహం లేకుంటే నేను సురాపానం సినిమా చేసి ఉండేవాన్ని కాదు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. అయితే సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు చెప్పాలి అది ఎలాంటి సినిమా అనేది. ఇవాళ కంటెంట్ పరంగా చాలా కాంపిటిషన్ ఉంది. ఓటీటీ లో అనేక రకాల జానర్స్ తో సినిమాలు వస్తున్నాయి. సురాపానంలో ఇప్పటిదాకా చూడని ఓ కొత్త కథను చూస్తారు. ఫన్, ఎమోషన్, లవ్ వంటి అన్ని అంశాలుంటాయి. జూన్ 10న సినిమా చూసి ఆదరించండి అన్నారు.

హీరోయిన్ ప్రగ్యా నయన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో చలాకీ అమ్మాయిగా కనిపిస్తాను. నాకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. ఈ సినిమా కంటెంట్ చూశాక తెలుగు అమ్మాయి అని పిలుస్తున్నారు షూటింగ్ టైమ్ ను బాగా ఎంజాయ్ చేశాం. సినిమా విజయం మీద చాలా నమ్మకం ఉంది. థ్రిల్లింగ్ తో పాటు వినోదాన్ని అందించే సినిమా అవుతుంది. సురాపానం సక్సెస్ మీట్ లో కలుసుకుంటామని ఆశిస్తున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో మీసాల లక్ష్మణ్, ఫిష్ వెంకట్ తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.

Surapanam Movie Trailer Released:

Surapanam Kick and Fun Trailer Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement