Advertisement

డైరెక్ట‌ర్ కామెంటరీతో జీ 5లో రిప‌బ్లిక్‌


వీక్షకులకు ఎప్పుడూ కొత్తదనం అందించడం కోసం తపనపడే ఓటీటీ వేదిక జీ 5. వినోదం పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనం ఇస్తూ ఉంది. ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీలో మరో సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. డైరెక్టర్ కామెంటరీతో రిపబ్లిక్ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమైంది. దేశంలో ఈ విధంగా విడుదల చేస్తున్న తొలి ఓటీటీ వేదిక జీ 5, తొలి సినిమా రిపబ్లిక్ కావడం విశేషం.

Advertisement

వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు... ఏవి కావాల‌న్నా వీక్ష‌కులు ముందుగా చూసే ఓటీటీ వేదిక జీ 5. ఒక్క తెలుగులో మాత్రమే కాదు... హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. తెలుగులో గత ఏడాది అమృత రామమ్ నుండి మొదలుపెడితే 47 డేస్, మేకా సూరి, బట్టల రామస్వామి బయోపిక్కు ఇటీవల నెట్, అలాంటి సిత్రాలు వరకూ ఎన్నో సినిమాలను జీ 5డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది. థియేటర్లలో ఘన విజయాలు సాధించిన రాజ రాజ చోరను విజయదశమికి, శ్రీదేవి సోడా సెంటర్ ను దీపావళికి విడుదల చేసింది. ఇటీవల ఒరిజినల్ వెబ్ సిరీస్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అంతకు ముందు ఒరిజినల్ మూవీ హెడ్స్ అండ్ టేల్స్ విడుదల చేసింది. ఈ నెల 26న రిపబ్లిక్సినిమాను విడుదల చేయనుంది. 

సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా రిపబ్లిక్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ రూపొందిన చిత్రమిది. ప్రజలను చైతన్యపరిచేలా ఉందని విమర్శకులతో పాటు ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 26న జీ 5 ఓటీటీ వేదికలో విడుదల కానుంది. అదీ డైరెక్టర్ కామెంటరీతో!

సాధారణంగా ప్రేక్షకులు సినిమా చూస్తారు. సినిమాలో సన్నివేశాల గురించి విమర్శకులు విశ్లేషిస్తారు. అయితే... తాను ఏ కోణంలో సదరు సన్నివేశం, సినిమా తీశానన్నది దర్శకుడి కామెంటరీతో సినిమా చూపిస్తే? అటువంటి ప్రయత్నానికి జీ 5, దర్శకుడు దేవ్ కట్టా శ్రీకారం చుట్టారు. సినిమా ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ బీకేఆర్... ముగ్గురితో రిపబ్లిక్ విజువల్ టైమ్ లైన్ గురించి దేవ్ కట్టా డిస్కస్ చేశారు. డైరెక్టర్ కామెంటరీతో సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సాధారణంగా కూడా సినిమా చూడవచ్చు. ఈ నెల 26 నుంచి జీ 5 ఓటీటీ వేదికలో రిపబ్లిక్ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

Republic to stream on ZEE5:

Republic to stream on ZEE5 from November 26
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement