AP Film Chamber Joint Secretary Eyelid
in /home/cinejosh/public_html/news_story_telugu_amp.php on line 117ఏ. పి. ఫిల్మ్ ఛాంబర్ జాయింట్ సెక్రటరీ కన్నుమూత
కరోనా కాటుకు కుల మత ప్రాంత బేధం లేకుండా ఎందరో బలైపోతున్నారు. ఆ మహమ్మారి కాటుకు 30-04-21 వ తేదీ ఉదయం ఒక మంచి వ్యక్తి అసువులు బాశారు. ఆయనే టి. వెంకటేశ్వరరావు. ఆయన గతంలో కరణంగా పనిచేసాడు కాబట్టి అందరూ ఆయనను కరణం గారు అని పిలుస్తారు.. సినీ రంగంలో సీనియర్ డిస్ట్రిబ్యూటర్ గా పేరుగాంచిన అయన గతంలో కొన్నివందల సెకండ్ బ్యాచ్ సినిమాలను కొని డిస్ట్రిబ్యూట్ చేసాడు. వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండే అయన ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ జాయింట్ సెక్రెటరీగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు. మృధు స్వభావి అయిన ఆయన అందరితోనూ కలగలుపుగా ఉంటూ ఎందరో మెప్పు పొందాడు. ఆయన లేని లోటు ఎవ్వరూ భర్తీచేయలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని బగవంతుని ప్రార్థిస్తూ, ఆయన మృతికి ఏ. పి. ఫిల్మ్ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ, సెక్రటరీ జె. వి. మోహన్ గౌడ్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు సంతాపం తెలియ చేసారు.