Advertisement

`ఓదెల రైల్వేస్టేష‌న్` సెంకండ్ షెడ్యూల్ ప్రారంభం!


సంప‌త్‌నంది స్క్రిప్ట్‌తో కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తున్న‌`ఓదెల రైల్వేస్టేష‌న్` సెంకండ్ షెడ్యూల్ ప్రారంభం.

Advertisement

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో ఏమైంది ఈవేళ‌, బెంగాల్ టైగ‌ర్ వంటి సూప‌ర్‌హిట్‌ చిత్రాల‌ను అందించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో  శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఓదెల రైల్వేస్టేష‌న్. ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. హీరోగా ద‌య‌విట్టు గ‌మ‌నిసి, 8MM బుల్లెట్,  ఇండియా vs ఇంగ్లాండ్‌, మాయ‌బ‌జార్ 2016, వంటి హిట్ చిత్రాల‌తో పాటు  క‌న్న‌డ‌లో 25 చిత్రాల‌కు పైగా న‌టించిన వ‌శిష్ట సింహ తెలుగులో హీరోగా న‌టిస్తోన్న మొద‌టి సినిమా ఇది. ఈ చిత్రంలో ప‌ల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్య‌మైన పాత్ర‌లో హీరోయిన్ హెభా ప‌టేల్ న‌టిస్తోంది.  ఓదెల అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. మేకప్, డ్రీమ్‌ సీక్వెన్సెస్, పాటలు లేకుండా సినిమాను ఎంతో వాస్తవికంగా తెరకెక్కించనున్నారు.  క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఓదెలలో మొద‌టి షెడ్యూల్ పూర్తిచేసింది చిత్ర యూనిట్‌. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయి.   ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చిన చిత్ర‌యూనిట్ ఈ రోజు(అక్టోబ‌ర్ 30) నుండి రెండో షెడ్యూల్ షూటింగ్‌కి రెడీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాత కె.కె. రాధా మోహ‌న్ మాట్లాడుతూ -   తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా నిలిపిన ఓదెల రైల్వేస్టేషన్ సెకండ్ షెడ్యూల్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని కొన్ని కీల‌క‌మైన‌ స‌న్నివేశాల‌తో పాటు  క్లైమాక్స్‌ను చిత్రీక‌రించ‌నున్నాం. ఇప్ప‌టికే డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి త్వ‌ర‌లో మీ ముందుకు తీసుకువ‌స్తాం అన్నారు. 

మొద‌టి షెడ్యూల్‌లో  కొన్ని సీన్లను ఓదెల ర్వైల్వేస్టేషన్లో చిత్రీకరించగా మరికొన్ని సన్నివేశాలను ఓదెల మండలంలో తెర‌కెక్కించ‌డం జ‌రిగింది.త‌మ  గ్రామంలో సినిమాను చిత్రీకరిస్తూ ఈ మండలం గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం ఆనందంగా ఉంద‌ని దర్శకుడు సంపత్ నందికి ఓదెల గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

'Odela RailwayStation' Second Schedule Begins:

K.K. Radhamohan's New Film With Sampath Nandi's Script, 'Odela RailwayStation' Second Schedule Begins
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement