Advertisement

సోషియో ఫ్యాంటసీ చిత్రం ‘అంగుళీక’


   ఆరువందల ఏళ్ల క్రితం జరిగిన ఓ యాథార్థ సంఘటన ఆధారం చేసుకుని సినిమాకు తగ్గట్టుగా కొన్ని కల్పిత పాత్రలతో తెరకెక్కిన సోషియో  ఫ్యాంటసీ చిత్రమే ‘అంగుళీక’. శ్రీ శంఖు చక్ర ఫిలింస్‌ పతాకంపై దీపక్‌, శేఖర్‌ వర్మ, వివ్యశాన్త్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. కోటి తూముల, ఎ.జగన్‌మోహన్‌రెడ్డి నిర్మాతలు . ప్రేమ్‌ ఆర్యన్‌ దర్శకుడు. ఇటీవల  సెన్సార్‌ కార్యక్రమాలు  పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ఈ నెల 20న గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు ఫిలించాంబర్‌లో  చిత్రయూనిట్‌ ట్రైలర్  లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి టి.ప్రసన్న కుమార్‌,  నిర్మాత  దామోదర్‌ ప్రసాద్‌, ముత్యాల రాందాస్, ఏలూరు సురేందర్ రెడ్డి  ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

Advertisement

 ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ..‘అంగుళీక’ ట్రైలర్  బాగుంది. గ్రాఫిక్స్‌ కూడా చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. నిర్మాత బడ్జెట్‌, దర్శకుడి ప్రతిభ ట్రైలర్ కనిపిస్తోంది. అరుంధతి లా ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించాలి. ఇక థియేటర్స్‌ బంద్‌ అంటూ కొందరు అసత్య ప్రచారాలు  చేస్తున్నారు. అందులో నిజం లేదు. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయవద్దు అన్నారు. 

 దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. అంగుళీక, పాటలు , ట్రైలర్  ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ నెల  20న వస్తోన్న సినిమా  పెద్ద సక్సెస్‌ కావాలని ఆకాంక్షిస్తున్నా. ఇక థియేటర్స్‌ బంద్‌ అంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రస్తుతానికి ఎలాంటి బంద్‌ లేదు. త్వరలో  పరిస్థితులు  చక్కబడి పబ్లిక్‌ యథావిధిగా  థియేటర్స్ కు వచ్చే  అవకాశాలు  ఉన్నాయి అన్నారు.

 హీరోయిన్‌ వివ్య శాంత్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా పాత్రకు చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుంది. అందరూ తప్పకుండా సినిమా చూడాలి. ఇంత మంచి అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు   నా ధన్యవాదాలు  అన్నారు.

 హీరో శేఖర్‌ వర్మ మాట్లాడుతూ...ఒక మంచి సినిమాలో నేనూ పార్ట్‌ కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా రిలీజ్‌ వరకు వచ్చిందంటే మా నిర్మాత, దర్శకుడి శ్రమ ఎంతో ఉంది. మా చిత్రాన్ని పెద్ద హిట్‌ చేస్తారని కోరుకుంటున్నా అన్నారు.

 నిర్మాత కోటి తూముల  మాట్లాడుతూ... ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమాను నిర్మించాం. కొన్ని కారణాల   వల్ల సినిమా డిలే   అయినప్పటికీ  అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. సినిమాపై అందరం ఎంతో నమ్మకంతో ఉన్నాం. ఈ నెల  20న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం అన్నారు.

 నిర్మాణ సారథి రాంబాబు చిక్కవరపు మాట్లాడుతూ..దర్శకుడు ప్రేమ్‌ ఆర్యన్‌ బాలీవుడ్‌ చిత్రాలకు  గ్రాఫిక్స్‌ విభాగంలో పని చేసిన అనుభవంతో ఈ సినిమాను ఒక విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దాడు. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. మనకు ఏడు రకాల  సూర్యగ్రహణాలు  ఉంటాయి. అందులో ఒక సూర్యగ్రహణం అంగుళీక ఆకారంలో ఉంటుంది. సూర్యభగవానుడి అంశలో పుట్టిన ఒక అమ్మాయికి, అంగుళీక సూర్యగ్రహణానికి ఒక లింక్‌ ఉంటుంది. ఆ లింక్‌ ఏంటనేదే సినిమా. కోటి తూముల  గట్స్‌ ఉన్న నిర్మాత. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించాడు. ఈ నెల  20న విడుదలయ్యే మా సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది అన్నారు.

 దర్శకుడు ప్రేమ్‌ ఆర్యన్‌ మాట్లాడుతూ..సూర్యభగవానుడి అంశలో పుట్టిన అంగుళీక అనే అమ్మాయి కథే ఈ చిత్రం. ఆరువందల ఏళ్ల క్రితం జరిగిన ఓ చిన్న సంఘటనను బేస్‌ చేసుకుని సినిమాగా మలిచాం. ఆరు వంద ఏళ్లకోసారి వచ్చే అంగుళీక సూర్యగ్రహణం ఈ సంవత్సరం 2020లో రానుండటం  విశేషం. మా నిర్మాతలు ఇచ్చిన సహకారంతో సినిమాను అనుకున్న విధంగా తీయగలిగాను అన్నారు.

Socio fantasy movie Angulika:

 Socio fantasy movie Angulika
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement