శేఖర్ కమ్ముల మంత్రం అదే..!

సున్నితమైన ప్రేమ కథల్ని హృద్యంగా తెరకెక్కించడంలో నేర్పరి అయిన శేఖర్ కమ్ముల మరోసారి విభిన్నమైన ప్రేమ కథతో మన హృదయాలని తాకడానికి సిద్ధం అవుతున్నాడు. శేఖర్ కమ్ముల ఇప్పటి వరకు చాలా సినిమాలే చేసాడు.. రెండు మూడు డిఫరెంట్ జోనర్లలోనూ సినిమాలు తీసాడు. కాని శేఖర్ కమ్ముల అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రేమ కథలే... ఒక్కో దర్శకుడు ఒక్కో జోనర్ లో తన ప్రత్యేకతని చాటుకుంటాడు.

 

అలా శేఖర్ కమ్ముల ప్రేమ కథల్ని తెరకెక్కించడంలో తనదైన ప్రత్యేకతని చాటుకున్నాడు. అదేంటో తెలీదు గానీ ఆయన సినిమాల్లో హీరో, హీరోయిన్లు ఎక్కడో బయట వాళ్ళలాగా మనకి సంబంధం లేని వాళ్లలాగా కనిపించరు. మొదటి సినిమా నుండి గమనిస్తే ప్రతీ క్యారెక్టర్ మనం ఎక్కడో చూసినట్టుగానో, మనచుట్టూ ఉన్నట్టుగానో ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మనమే సినిమాలో ఉన్నామేమో అన్న భావన కలుగుతుంది.

 

అందుకే ఆయన తీసే ప్రేమ కథలకి మనం అంతగా కనెక్ట్ అవుతుంటాం. ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కి సంబంధించి ఒక మ్యూజిక్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియోలో సాయిపల్లవి నాగచైతన్య ల మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ముఖ్యంగా వీదియో చివర్లో సాయిపల్లవి నాగచైతన్యని ముద్దు పెట్టుకున్నప్పుడు నాగచైతన్య చూపించిన ఎక్స్ ప్రెషన్ హైలైట్ గా నిలిచింది. 

 

ఈ ఒక్క సీన్ చాలు ఈ సినిమాలో నాగచైతన్య పర్ ఫార్మెన్స్ అదిరిపోతుందని చెప్పడానికి.. నాగచైతన్య కెరిర్ బెస్ట్ పర్ ఫార్మెన్స్ తో పాటు మరో మంచి లవ్ స్టోరీని చూడబోతున్నామని క్లియర్ గా అర్థం అవుతోంది. 

shekar kammula ready to do magic with love story :

shekar kammula new movie love story


LATEST NEWS