Advertisement

'హ్యాపి వెడ్డింగ్' రిలీజ్ డేట్ ఫిక్స్..!


ల‌వ‌ర్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌.... అచ్చ‌ తెలుగు చీర‌క‌ట్టుతో ప‌ద‌హ‌ర‌ణాల తెలుగు పిల్లగా తెలుగు తెర‌కి పరిచ‌య‌మ‌య్యి ప్ర‌తి తెలుగు వారింటి ఆడ‌ప‌డుచులా  త‌న ప్లెజెంట్ న‌ట‌న‌తో సుస్థిర‌ స్థానం సాధించుకున్న నిహ‌రిక కొణిదెల జంటగా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ప్రతిష్టాత్మక యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తోంది. యంగ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య దర్శకుడు.  సంగీతం- శక్తికాంత్, రీరికార్డింగ్‌- ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌ అందిస్తున్నారు. బాల్ రెడ్డి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. ఈ చిత్రం కథానాయకుడు సుమంత్ అశ్విన్ బర్త్ డే సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. జూలై 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా

Advertisement

నిహారిక మాట్లాడుతూ.. యువి క్రియేష‌న్స్ లో సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ల‌క్ష్మ‌ణ్ చాలా బాగా తెర‌కెక్కించారు. ప్ర‌తి పాత్ర మెప్పిస్తుంది. సినిమా మొత్తం ప్లెజెంట్‌గా ఉంటుంది. అన్ని వ‌ర్గాల‌ వారికీ న‌చ్చుతుంది.. అని అన్నారు.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. యువీ క్రియేష‌న్స్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది. నీహారిక‌తో న‌టించ‌డం మంచి ఎక్స్ పీరియ‌న్స్. ఆవిడ మంచి కోస్టార్‌. చ‌క్క‌గా న‌టించారు. నా కెరీర్‌కి ఈ సినిమా మంచి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను.. అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో జ‌రిగే విష‌య‌మే. అయితే పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగేరోజు వ‌ర‌కు రెండు కుటుంబాల మధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా చూపించాం. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఇలాంటి అనుభ‌వం ఉంటుంది. ప్ర‌తి ప్రేక్ష‌కుడు త‌మ‌ని తాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. అన్ని వ‌ర్గాల, అన్ని వ‌య‌సుల వారు ఈ చిత్రానికి క‌నెక్ట్ అవుతారు.. అని అన్నారు.

Happy Wedding Release Date Fix:

Happy Wedding Press Meet Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement