Advertisement

నితిన్ వారాల సాంగ్ వచ్చేసింది..!


'ఫస్టు లుక్కు సోమవారం, మాట కలిపే మంగళవారం' అంటూ మన యువ కథానాయకుడు నితిన్ 'గ ఘ మేఘ' తో ఉన్న తన అనుబంధాన్ని  శ్రోతలతో పంచుకున్నారు.

Advertisement

'నితిన్, మేఘ ఆకాష్' జంటగా నటిస్తున్న చిత్రం 'ఛల్ మోహన్ రంగ'. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

'ఫస్టు లుక్కు సోమవారం' అంటూ మొదలయ్యే సాహిత్యాన్ని  సీరియస్ గా తీసుకున్నారేమో తెలియదు కాని, నిజంగానే ఈ సినిమా ఫస్ట్ లుక్ సోమవారం (ఫిబ్రవరి 12న) రిలీజ్ చేశారు. ఇక ఈ 'వారం'  గీతం ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల అయింది. 

'గ ఘ మేఘ' పాటతో జనాలకి మరోసారి మంచి మెలోడీ అందించిన థమన్ ఈ సారి మంచి డాన్స్ నెంబర్ తో వస్తున్నారు. ఆయన పాటల్లో ట్యూన్ కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఇన్స్ట్రుమెంట్స్ కి కూడా అంతే ప్రాముఖ్యత  ఉంటుంది. అందుకే ఆయన పాటలు వినగానే ఆడియన్స్ మదిని దోచుకుంటాయి..

కాని ఆ సంగీతానికి సాహిత్యం తోడైతేనే ఆ పాట జనాల హృదయాలలో ఎక్కువ రోజులు నిలుస్తుంది. వారంలో ఏడు రోజులు ఉంటే, ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉందంటూ తనదైన చమత్కారాన్ని వాడి, సాహిత్య అవార్డ్ గ్రహీత  కేదారనాథ్ ఈ పాటను రచించగా, నాకాష్ అజీజ్ తన స్వరంతో పాటను శ్రోతలకి మరింత చేరువుగా తీసుకొచ్చారు. సంగీత, సాహిత్యాల కలబోత చిత్రంలోని పాటలు అన్నారు దర్శకుడు కృష్ణ చైతన్య. నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు.

చిత్రంలోని ఇతర ప్రధాన తారాగణం: డా.కె.వి.నరేష్, లిజి, రోహిణి హట్టంగడి, రావురమేష్, సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృతిక, మాస్టర్ జాయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.

సంగీతం: థమన్.ఎస్, కెమెరా: ఎన్.నటరాజ సుబ్రమణియన్,కూర్పు: ఎస్.ఆర్.శేఖర్,నృత్యాలు: శేఖర్.వి.జె, పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ; సమర్పణ: శ్రీమతి నిఖిత రెడ్డి, నిర్మాత: ఎన్.సుధాకర్ రెడ్డి స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: కృష్ణ చైతన్య 

Chal Mohan Ranga Second Song Released:

Nithin and Megha Akash Chal Mohan Ranga movie Week song Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement