Advertisement

'అర్ధనారి' రిలీజ్ కు సిద్ధమవుతోంది!


అర్జున్ యజత్, మౌర్యాని ప్రధాన పాత్రల్లో పత్తికొండ సినిమాస్ పతాకంపై భాను శంకర్ చౌదరి దర్శకత్వంలో రవికుమార్ నిమిస్తోన్న చిత్రం 'అర్ధనారి'. ఈ సినిమా ట్రైలర్ ను శనివారం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు విడుదల చేశారు. ఈ సందర్భంగా..

Advertisement

పసుపులేటి రామారావు మాట్లాడుతూ.. ''భాను శంకర్ ఇది వరకు కూడా మంచి సినిమాలు చేశాడు. కానీ తన ప్రతిభకు తగిన సినిమా పడలేదు. ఈ సినిమా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటివరకు ఇలాంటి ట్రైలర్ చూడలేదు. ఈ సినిమాతో భానుకి మంచి లైఫ్ వస్తుందని భావిస్తున్నాను'' అని చెప్పారు. 

దర్శకుడు భాను శంకర్ చౌదరి మాట్లాడుతూ.. ''ఇదొక డిఫరెంట్ ఫిల్మ్. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాను చాలా మంది హీరోలతో  చేయడానికి ప్రయత్నించాను. కానీ అర్ధనారి పాత్రలో నటించడానికి ఎవరు ముందుకు రాలేదు. 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా చేయాలనుకున్నాం. కానీ నిర్మాతలకు ఉన్న పరిధిలో చక్కగా ఈ చిత్రాన్ని రూపొందించాం. 95 రోజులు ఈ సినిమా కోసం పని చేశాం. సుమారుగా 85 రోజుల షూటింగ్ నిజామాబాద్ లో చేశాం. ఎందుకంటే ఈ సినిమా పబ్లిక్ లో చేయాల్సింది. జులై 1 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు. 

నిర్మాత రవి కుమార్ మాట్లాడుతూ.. ''కథ బాగా నచ్చింది. చాలా మంది హీరోలతో సినిమా చేయడానికి సంప్రదించాం. కానీ కుదరలేదు. ఓ మంచి సినిమా చేశామని తృప్తి ఉంది. ప్రేక్షకులను ఆదరిస్తారనే నమ్మకముంది'' అని చెప్పారు. 

సమర్పకుడు భరత్ రాజ్ మాట్లాడుతూ.. ''బాను నాకు 15 ఏళ్లగా తెలుసు. తాను స్టోరీ చెప్పగానే బాగా ఇన్స్పైర్ అయ్యాను. సినిమా కమర్షియల్ గా ఉంటూనే సొసైటీకి మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుంది'' అని చెప్పారు

ఇంకా ఈ కార్యక్రమంలో కర్లపూడి కృష్ణ, మౌర్యాని తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సాయి శ్రీనివాస్ గాదిరాజు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరావు, సంగీతం: రవివర్మ, ఆర్ట్: డి.వై.సత్యనారాయణ, మాటలు: నివాస్, నిర్వహణ నిర్మాత: కర్లపూడి కృష్ణ, నిర్మాత: రవికుమార్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: భాను శంకర్ చౌదరి.  

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement