Advertisement

'మనలో ఒకడు' సినిమా ప్రారంభం!


యుని క్రాఫ్ట్ మూవీస్ పతాకంపై ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వం వహిస్తూ.. నటిస్తోన్న చిత్రం 'మనలో ఒకడు'. జి.సి.జగన్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక శుక్రవారం హైదరాబాద్ లోని రామనాయుడు స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి వేణుగోపాలచారి క్లాప్ కొట్టగా.. వేమూరి రాధాకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చలసాని శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా..

Advertisement

ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ.. ''జగన్ గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. ఆయనొక 50 కథలు విని ఉంటారు కాని ఏ కథ నచ్చలేదు. నేను కథ చెప్పిన వెంటనే నాకు అడ్వాన్స్ ఇచ్చి సినిమా మొదలుపెట్టమని చెప్పారు. ఎన్నో నిజాలను బయటపెట్టాలని చేసిన ప్రయత్నమే ఈ సినిమా. సిల్లీగా అనిపించే విషయాలే చాలా సీరియస్ గా మారిపోతుంటాయనే లైన్ తో సినిమా చేశాను. ఈ సినిమాలో మీడియా ముఖ్య పాత్ర పోషిస్తుంది. సామాన్య ప్రేక్షకుడు గుర్తించే విధంగా సినిమాలో ప్రతి పాత్ర ఉంటుంది. ప్రతి ఒక్క మంచి మనలో ఒకడే.. ఈఎ సినిమాకు కథే హీరో. జూనియర్ కాలేజీ లెక్చరర్ పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తాను. అనిత నా భార్య పాత్రలో నటిస్తుంది. అలానే సాయికుమార్ గారు ఓ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. సినిమాలో మొత్తం 4 పాటలుంటాయి. మార్చి 10న షూటింగ్ మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. హైదరాబాద్ లో మొత్తం చిత్రీకరణ జరపనున్నాం. 2016 లో బెస్ట్ మూవీగా సినిమా నిలిచిపోతుంది'' అని చెప్పారు.

చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''మీడియా ప్రభావం పరిమితంగా కాకుండా అపరిమితంగా ఉంటోంది. మీడియా వ్యవస్థకు, సామాన్య ప్రజలకు ఉన్న సమస్యలను తెలియబరిచే విధంగా ఈ సినిమాను నిర్మించడానికి పూనుకున్నారు. సమాజంలో మార్పు కోసం ఇలాంటి సినిమాలు చేయడం అభినందించాల్సిన విషయం'' అని చెప్పారు.

జగన్మోహన్ మాట్లాడుతూ.. ''ఎన్నో కథలు విన్నాను. కాని నా మొదటి సినిమాగా సమాజానికి ఉపయోగపడే సినిమా చేయాలనుకున్నాను. ఆర్.పి.పట్నాయక్ గారు చెప్పిన కథ నచ్చి సినిమా చేయడానికి అంగీకరించాను'' అని చెప్పారు. 

ఈ చిత్రానికి డైలాగ్స్: తిరుమల్ నాగ్, సినిమాటోగ్రాఫర్: ఎస్.జె.సిద్ధార్థ్, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్, ఆర్ట్ డైరెక్టర్: సి.హెచ్.కృష్ణ, ప్రొడక్షన్ కంట్రోలర్: రాజేష్ రంభాల, ప్రొడ్యూసర్: జి.సి.జగన్మోహన్, కథ-స్క్రీన్ ప్లే-మ్యూజిక్-దర్శకత్వం: ఆర్.పి.పట్నాయక్.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement