Advertisement

''సీతమ్మ అందాలు..'' సక్సెస్ మీట్!


రాజ్ తరుణ్, అర్థన జంటగా శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మిస్తోన్న చిత్రం 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు'. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు. జనవరి 29 న రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో..

Advertisement

రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ''మనసు పెట్టి చేసిన సినిమా ఇది. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చేశాం. మేము ఏదైతే నమ్మి తీశామో.. ఆ కథను ఈరోజు ప్రేక్షకులు ఆదరించడం సంతోషంగా ఉంది. ఫ్యామిలీ అంతా కలసి ధియేటర్లకు వస్తున్నారు. విశాఖ, అమలాపురం, భీమవరం నుంచి సినిమా బాగుందంటూ పలువురు ఫోనులు చేస్తున్నారు'' అని అన్నారు.    

శైలేంద్రబాబు మాట్లాడుతూ.. ''నిర్మాతగా తెలుగులో నా మొదటి సినిమా ఇది. మా నిర్మాత శ్రీధర్, హరీష్ మంచి టీంను సెలెక్ట్ చేసుకున్నారు. రాజ్ తరుణ్ బాగా నటించాడు. మా అబ్బాయి కన్నడలో హీరో. ఈ సినిమాలో ఓ పాటలో రాజ్ తరుణ్ తో కలసి స్టెప్పులు వేశాడు'' అని అన్నారు.   

శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ.. ''ఇంత మంచి జీవితం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. వరుసగా మూడు హిట్స్ ఇచ్చిన తర్వాత నన్ను ఓ మెట్టు పైకి ఎక్కించడానికి ఈ సినిమా చేసిన నా ఫ్రెండ్ రాజ్ తరుణ్ కి థాంక్స్. రాజ్ సహజంగా నటిస్తాడు. తన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఈ కథ రాశాను. సింపుల్ కథ, ఫ్యామిలీ అంతా కలసి చూసేలా తీశాం. కథ రెగ్యులర్ అయినా, బోర్ కొట్టకుండా బాగా తీశారని ప్రేక్షకులు చెబుతున్నారు. అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సీనియర్ నటీనటులందరూ బాగా సపోర్ట్ చేశారు'' అని అన్నారు.      

శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ''అన్ని ఏరియాల్లో ఓపెనింగ్స్ సూపర్బ్. రాజ్ తరుణ్ కెరీర్లో నాలుగో హిట్. సక్సెస్ జర్నీ ఇలాగే కంటిన్యూ చేయాలి. భవిష్యత్తులో శ్రీనివాస్ గవిరెడ్డి పెద్ద దర్శకుడవుతాడు. విశ్వ సినిమాటోగ్రఫీ, గోపిసుందర్ మ్యూజిక్, కామెడీ.. అన్నీ బాగున్నాయి'' అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో అర్థన, షకలక శంకర్, రాజా రవీంద్ర, హరీష్ దుగ్గిశెట్టి,  నైజాం డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, వరహాల బాబు, డాక్టర్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.   

ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సుద్ధాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: విశ్వ, ఆర్ట్: జేవీ, అడిషనల్ డైలాగ్స్: అనీల్ మల్లెల, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి వెంకటరమణ, సమర్పణ; శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు, కథ,స్కీన్ ప్లే,దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement