Advertisement

కెసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్న గుణ టీం!


అనుష్క ప్రధాన పాత్రలో గుణ టీమ్‌ వర్క్స్‌ పతాకంపై డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ స్వీయనిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం రుద్రమదేవి. ఈ చిత్రానికి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ వినోదపు పన్ను మినహాయిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలపడానికి చిత్ర బృందం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా..

Advertisement

గుణశేఖర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసీఆర్ కు కళల పట్ల ఆసక్తి ఉందని విన్నాను. ఈరోజు స్వయంగా చూసాను. చరిత్రకు సంబంధించిన చిత్రాలను ప్రోత్సహించాలంటూ రుద్రమదేవి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చారు. కళల పట్ల కెసీఆర్ కున్న గౌరవం ఇది.13వ శాతాబ్దంలో కాకతీయుల సంక్షేమం కోసం గణపతి దేవుడు వెలది చెరువులను తవ్వించారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని మిషన్ కాకతీయ పేరుతో కెసీఆర్ చెరువులు తవ్వించడం శుభ పరిణామం, ఓపక్క హైటెక్ యుగంలో వెళ్తూ, సంప్రదాయాలకు విలువ ఇస్తున్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా సినిమా చూస్తానన్నారు. ఆయనకు మా కృతజ్ఞతలు.  రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలుస్తున్నాం. కెసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహం చంద్రబాబు కూడా ఇస్తారని ఆశిస్తున్నాను.. అని అన్నారు.  

దిల్ రాజు మాట్లాడుతూ.. గుణశేఖర్ గారితో ఏడాదిన్నరగా ట్రావెల్ చేస్తున్నాను. ఇండస్ట్రీలో సినిమా గురించి ఎలా ఆలోచిస్తారో.. నేను కూడా అలానే ఆలోచించాను. లేడీ ఓరియెంటెడ్ సినిమా, కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా.. లేదా.. అని సందేహించాను. ప్రకాష్ రాజ్ చెప్పడంతో కథ విన్నాను. గుణశేఖర్ గారు మూడు గంటలు కథ చెప్పారు. నాకు నచ్చి వెంటనే మా శిరీష్, లక్ష్మణ్ లకు వినిపించాను. సినిమాలో భాగస్వాములుగా మారాం. సిజి, గ్రాఫిక్స్ వర్క్స్ ఆలస్యం కావడంతో విడుదల ఆలస్యమైంది. అక్టోబర్ 9 నా ఈ సినిమా విడుదల చేస్తున్నామని ప్రకటించారు. నిన్న  2డి, 3డీలో సినిమా చూశాను. చెప్పిన కథలో ఫీల్ మిస్ కాకుండా తీశారు. 2డీలో చూసిన వారు మళ్లీ 3డీలో చూడండి. ఈరోజు గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. వినోదపు పన్ను మినహాయించారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు.. అని అన్నారు.

అనుష్క మాట్లాడుతూ.. గుణశేఖర్ గారి 9 ఏళ్ళ కష్టం ఈ సినిమా. ఆయన కల సాకారం కావడం కోసం కుటుంబం అంతా ఎంతో సహకారం అందించారు. సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాం. అందరికి నచ్చుతుంది. కెసీఆర్ గారు, మాకు సహకరించిన అందరికి ధన్యవాదాలు.. అని అన్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement