Advertisement

'ధనలక్ష్మి తలుపు తడితే' విడుదలకు సిద్ధం!


మాస్టర్‌ సుక్కురామ్‌ సమర్పణలో.. ధనరాజ్‌, మనోజ్‌నందం, శ్రీముఖి, సింధుతులాని, రణధీర్‌, అనిల్‌ కళ్యాణ్‌, విజయసాయి, నాగబాబు, తాగుబోతు రమేష్‌ ముఖ్యతారాగణంగా భీమవరం టాకీస్‌ పతాకంపై.. సాయి అచ్చుత్‌ చిన్నారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న నాన్‌స్టాప్‌ హిలేరియస్‌ ఎంటర్‌టైనింగ్‌ థ్రిల్లర్‌ ‘ధనలక్ష్మి తలుపు తడితే’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని జూలై 31న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సమావేశంలో..

Advertisement

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ "ఈ నెల 31న ధనలక్ష్మి తలుపు తడితే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఈ సినిమాపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సాయి అచ్యుత్ అధ్బుతంగా డైరెక్ట్ చేసాడు. ధనరాజ్ సంపాదించుకున్న డబ్బు మొత్తం ఈ చిత్రంపైనే పెట్టాడు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం" అని చెప్పారు.

ధనరాజ్ మాట్లాడుతూ "కళామతల్లి నాకు ఇచ్చిన డబ్బును కళామతల్లిపైనే పెట్టాను. సాయి అచ్యుత్ నాకు చెప్పిన కథను అధ్బుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చాలా మంది నేను అడిగిన వెంటనే ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారు. ఈ సినిమాకి కథే హీరో. భోలే మంచి మ్యూజిక్ ఇచ్చారు. కెమెరామెన్ తన సొంత సినిమాల భావించి ఈ చిత్రానికి పని చేసారు. ఖచ్చితంగా ఈ చిత్రానికి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది" అని చెప్పారు.

మనోజ్ నందం మాట్లాడుతూ "సినిమాకు మంచి థియేటర్స్ దొరికాయి. ఎమోషన్స్ తో ఎంటర్టైన్ చేసే చిత్రమిది. సినిమా మంచి సక్సెస్ ను సాధించి నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావాలి" అని అన్నారు.

దర్శకుడు సాయి అచ్యుత్ చిన్నారి మాట్లాడుతూ "కథ, కథనాలు హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో కామెడీతోపాటు చాలా ట్విస్టులు, సర్‌ప్రైజులు కూడా ఉంటాయి. సినిమా మొదటి కాపీ చూసిన వారంతా ఖచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. ఈ చిత్రానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా థాంక్స్" అని చెప్పారు.

మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ "తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారి 75 వ చిత్రాన్ని ధనరాజ్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాడంటేనే తెలుస్తుంది సినిమాపై ఆయనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో.. మా తరపున చిత్రానికి కావాల్సిన సహకారాలు అందిస్తాం" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వల్లూరిపల్లి రమేష్, కోడలి వెంకటేశ్వరావు, శ్రీముఖి, అనిల్ కళ్యాన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌: శివ వై.ప్రసాద్‌, కెమెరామెన్‌: జి.శివకుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: ప్రసాద్‌ మల్లు (యుఎస్‌ఎ) ప్రతాప్‌ భీమిరెడ్డి (యుఎస్‌ఎ), సమర్పణ: మాస్టర్‌ సుక్కురామ్‌, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్‌ప్లే-సంభాషణలు-దర్శకత్వం: సాయి అచ్యుత్‌ చిన్నారి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement