Advertisement

'ఆంధ్రాపోరి' సినిమా సక్సెస్ మీట్..!


ఆకాష్‌ పూరి, ఉల్క గుప్తా జంటగా ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రాజ్‌ మాదిరాజు దర్శకత్వంలో ఎ.రమేష్‌ప్రసాద్‌ నిర్మించిన యూత్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆంధ్రాపోరి’. జూన్ 5న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సోమవారం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు పూరిజగన్నాథ్ మాట్లాడుతూ "రమేష్ ప్రసాద్ గారి బ్యానర్ లో ఆకాష్ నటించడం చాలా ఆనందంగా ఉంది. సినిమా బావుంది. సెకండ్ హాఫ్ నాకు చాలా నచ్చింది. డైరెక్టర్ గారు అధ్బుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. జోశ్యభట్ల గారి సంగీతం బావుంది. రెండు, మూడు పాటలు వినాలనిపిస్తునే ఉన్నాయి. వనమాలి ఫోటోగ్రఫీ చూసిన తరువాత ఆయనతో ఓ సినిమా చేయాలనిపించింది. ఆకాష్ మొదటి సినిమా అయినా పెర్ఫార్మన్స్ బావుంది. తెలంగాణా భాష రాకపోయినా నేర్చుకొని డైలాగ్స్ చెప్పాడు. మూడు సంవత్సరాల తరువాత ఖచ్చితంగా ఆకాష్ తో సినిమా చేస్తాను" అని చెప్పారు.

Advertisement

రాజ్ మాదిరాజ్ మాట్లాడుతూ "ఈ సినిమాలో నటించడానికి ఆకాష్ ను ఇచ్చినందుకు పూరి గారికి నా ధన్యవాదాలు. సినిమాలో ఆకాష్ నటన చూసిన వారందరూ తనని పెద్ద హీరోలతో పోలుస్తున్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే కూలింగ్ టవర్ సన్నివేశం సినిమాకు హైలైట్ గా నిలిచింది" అని చెప్పారు.

జోశ్యభట్ల మాట్లాడుతూ "పూరిజగన్నాథ్ గారి అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ చేసిన చిత్రంలో నాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. సినిమాలో పాటలకంటే రీరికార్డింగ్ బావుందని అందరు చెప్తున్నారు. ఇదొక సెన్సిబుల్ లవ్ స్టొరీ. చాలా నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు" అని చెప్పారు.

ఆకాష్ పూరి మాట్లాడుతూ "ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత రమేష్ ప్రసాద్ గారికి, దర్శకుడు రాజ్ మాదిరాజ్ గారికి థాంక్స్. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. కెమెరామెన్ కి స్పెషల్ థాంక్స్ నన్ను అందంగా చూపించారు. నా నటన గురించి నాన్నగారి నుండి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో భాస్కర్ భట్ల, వనమాలి తదితరులు పాల్గొన్నారు.

ఆకాష్‌పూరి, ఉల్క గుప్తా, అరవింద్‌ కృష్ణ, ఈశ్వరిరావు, పూర్ణిమ, ఉత్తేజ్‌, డా॥ శ్రీకాంత్‌, అభినయ, శ్రీముఖి ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌ వనమాలి, సంగీతం: డా॥ జోశ్యభట్ల, ఎడిటింగ్‌: శ్రీకరప్రసాద్‌, ఆర్ట్‌: రాజీవ్‌ నాయర్‌, డాన్స్‌: చంద్రకిరణ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: మహేష్‌ చదలవాడ, కోడైరెక్టర్‌: రమేష్‌ నారాయణ్‌, నిర్మాత: ఎ.రమేష్‌ప్రసాద్‌, దర్శకత్వం: రాజ్‌ మాదిరాజు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement